Love Letter 45
Written By Bhanu Chandara
సునంద వాళ్ళ బ్యాచ్ తో కలిసి విజయవాడ వెళ్ళాను.
దుర్గమ్మవారిని దర్శించుకుని కృష్ణమ్మ చెంతలో నేను, సునంద, అరుణ, మానస, లక్ష్మి వగైరా...వగైరా కూచున్నాం.
మధాహ్నం రెండైంది. ఆకలి బాగా వేస్తుంది. దుర్గమ్మ దగ్గర కొన్న పులిహోర ప్యాకెట్ ఓపెన్ చేసి కొద్దీ కొద్దిగా తింటుంటే...అరుణ తన బాగులోనుండి బీజర్ తీసింది. తలా ఒకటి ఇస్తుంటే నాకు వద్దన్నాను. ఏమి కాదులేవే తీసుకో అంటూ ఓపెన్ చేసి ఇచ్చారు. నేను చేతిలో పట్టుకుని తాగకుండా నీ గురించే ఆలోచిస్తుంటే..ఏయ్ దొరసాని...లండన్ వెళ్ళావా ఏంటి? అంటూ నన్ను వేలకొలాం చేస్తూంటే...నేను బలవంతముగా నవ్వుతు అరుణ ఇచ్చిన బీజర్ మొత్తం తాగేశాను.
అంతలో సునంద వైన్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసింది. నేను ఇంకో బీజర్ తీసుకుని అందులో సునంద ఇచ్చిన వైన్ కలుపుకుని తాగేశాను. గొంతులో చేదు చేదుగా లోపలికి దిగుతుంటే ఏదో చెప్పనలవి కానీ భాద...నీ రూపములో నను పట్టి పీడిస్తుంటే,,భరిస్తూ లేచి చిన్నగా నడక సాగించాను.
తాగిన మందు కనుకొలనుల నుండి కన్నీరుగా స్రవిస్తుంటే... కొద్దీ కొద్దిగా మందు తాగుతూ అల అల నడుచుకుంటూ..తెలీని దుఃఖముతో నదికి అడ్డముగా సాగాను. వెనుకాల నుండి ఫ్రెండ్స్ పిలుస్తున్న లెక్క చేయకుండా మత్తులో అలానే ముందుకు కదిలాను.
ఏదో అల వచ్చి నన్ను తాకగానే ఎవరో కొట్టినట్లన్పించి కోపముతో..నీ మీద కోపాన్ని ఆ చల్లని కృష్ణమ్మా తల్లిపై మంటలు కురిపిస్తూ..రాక్షసనందముతో జలాన్ని చెల్లా చెదురు చేస్తూ నా చేతిలో ఉన్న బాటిల్ ను విసురుగా నదిపై విసిరి...నాలోని అక్కసును నదిపై చూపిస్తూన్నా...ఓర్పుగా రావొద్దు రావొద్దు అంటూ ఆ తల్లి నన్ను హెచ్చరిస్తూ..వెనుకకు తోస్తున్న వినిపించుకోకుండా..విర్రవీగిన అహంకారంతో కాళ్లతో తంతు ముందుకు నడుస్తున్నాను.
నా గర్వాన్ని..అహంకారాన్ని భరించలేని నదీమ తల్లి "నా ముందు నువెంత?".. అంటూ కోపముతో పెద్ద నోరేసుకుని నను మింగబోతుంటే... వెనుక నుండి "ఏమైందే నీకు" అంటూ నన్ను వెనక్కు లాగుతూ బలవంతముగా తీసుకొచ్చింది సునంద.
నీ ఆలోచనల నదిలో ప్రవహిస్తూ నేను.
నీ ప్రేమలో నేను పడిపోయానా! లేక నీ మాయలో నేను మాయమయ్యనా!
ప్రేమ అనుకుంటూ నన్ను నేను మోసం చేసుకుంటున్నానా!
నాకు ప్రేమించడం రాదా...... ! ఎదుటివారి ప్రేమను పొందడం రాదా!
ప్రేమన్నదే మాయనా.. ! ప్రతి మనిషి మాయలోనే జీవిస్తున్నాడా....!
ప్రతి బ్రాంతి ఎండమావేనా!
అర్థమై అర్థం కానట్టు...అర్థం కాకుండా అర్ధమైనట్లు
చిత్రాతి చిత్రముగా విచిత్రముగా నవ్వుతు నేను...
ఇంకో పక్క నా అరికాళ్లను సుతిమెత్తగా ప్రెస్ చేస్తూ...చిరు మందహాసముతో అరుణ.
ఒకరి సానుభూతిలో కరిగిపోతూ మరొకరి దయలో ఒరిగిపోతూ ప్రక్కవారి జాలీ లో ఒదిగిపోతూ "ప్చ్" అనుకుంటూ
నా జీవితమింతేనా..ఇష్టమున్న లేకపోయినా జీవించాల్సిందేనా
మనసుని దుఃఖపెట్టుకుంటూ రోదించాల్సిందేనా!
నువ్వక్కడా...! నేనిక్కడా...!







Comments
Post a Comment