Love Letter 46
Written By Bhaanuchandara
ఎంతమంది చుట్టూ ఉన్న నువ్వు లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుంది.
నువ్వే లేని ప్రపంచంలో ఎలా జీవించాలి? నీ తోడు లేక నేనెలా బ్రతికేది?
ఆ ఖాళీని ఎలా భర్తీ చేయను? ఎలా ఎలా పురించను?
ఎండమావిని చూసి నీటి చలమలని భ్రమిస్తూ అలసి సొలసి చేరుకున్నాను. ఏమి లేదు... ..అదే ఎండ నన్ను కాల్చేస్తూ..నాలోని ప్రాణాన్ని తోడేస్తూంటే...నీ ప్రేమ దప్పికలో అల్లాడుతూ...నిర్వేదంతో..నిస్తేజముతో చతికిలపడ్డాను.
నాలోని నవ నాడులు సుస్వరాలు ఆలపించగా పిలుపు వినపడిన వైపు నడిచాను.
నేను పరుగు పరుగున అక్కడికి వెళ్లి ఆ పిలిచే అతన్ని తేరిపారా చూస్తుంటే..నన్ను ఎగాదిగా చూస్తూ ఏమనుకున్నాడో ఏమో అక్కడినుండి మెల్లగా జారుకున్నాడు.
ఇంతలో ఒకమ్మాయి వచ్చి ఏమిటలా పరిగెత్తుకుంటూ వచ్చావని అడుగుతుంటే "అదే అదే పొట్టి పొట్టి అని పిలుస్తుంటే తెల్సిన కంఠంలా అనిపించి వచ్చానని చెప్పాను. దానికా అమ్మాయీ నవ్వుతు అదా వాడు మా బావగాడు. నన్ను పొట్టి పొట్టి అని పిలుస్తాడు. నిన్ను చూసి బయపడి పారిపోయాడు. నన్ను చూసి బయపడటానికి నేనేమి అనలేదు కదా! అంటుంటే....
మీరు ఎగాదిగా చూస్తుంటే వాడికి సిగ్గేసింది..సిగ్గా! అంటుంటే అవునండి వాడికి చచ్చేంత సిగ్గు. నాకు ప్రపోజ్ చేయటానికే వాడికి పుష్కరం పట్టింది అది కూడా వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో ఏడుస్తుంటే వాడి అమ్మ నాలుగు తిట్లు తిట్టేసరికి సిగ్గుతో దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసాడు అని చెప్తుంటే నేను నవ్వాను.
ఏమండీ మీ నవ్వు చాల చాల బాగుందండి. మిమ్మల్నిచేసుకునేవాడు అదృష్టవంతుండండి. అంటుంటే....
నిజం చెప్పొద్దూ! నిన్ను తలచుకుని నాకు సిగ్గేసింది.
నా బుగ్గలు సిగ్గుతో కందిపోతుంటే అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ అమ్మాయిగారు పచ్చని జాబిలిలా మెరిసిపోతున్నారు. మిమ్మల్నిలా ఎవరైనా చుస్తే మీకు దిష్టి తగులుతుందంటూ అంటూ దిష్టి తీసింది.
తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ...ఏ జన్మలోనైనా నిన్ను బాధించి ఉంటె నన్ను మన్నించు ప్రియతమా!
Comments
Post a Comment