Posts

Showing posts from January, 2023

Love letter 1

Image
                                                                                                               Written by Bhanuchandara ఒరేయ్                                     ప్రేమ  ఓ  అద్భుతం …అది  అనిర్వచనీయం.   ఈ  అద్భుతమైన  ప్రేమే  మనిషిని …మనసును  ఊపిరాడనివ్వకుండా  చేస్తుంది. ఈ  అద్భుతమైన  ప్రేమ  నర ..నరాన్ని  మెలేసి ప్రాణాన్ని తోడేస్తుంది. ఎంతైనా  అద్భుతమైన  ప్రేమ  కదా!  ప్రతిదీ  అద్భుతముగా ఉంటుంది.   అర్థం కాలేదా అదేరా …చంపినా  ..బ్రతికించిన …ఏదైనా  అద్భుతమే. ఎస్...రెండు హృదయాల వంతెనపై పారిజాతపూలు పూయించేది ప్రేమ.   ఇద్దరి మనుషులను ఒక తాటిపై నడిపేది ప్రేమ.  జడత్వమునుండి చైతన్యానికి ప్రవహిస్తూ...పరవశించేది  ప్రేమ.  సరే అసలు విషయానికొద్దాం.   ఎద నిండిన భావాల  భావావేశం నీకు అర్థమవ్వాలని విపులముగా చెప్తున్నా....            అంతకు మించి  మరేం  లేదు. అవును మరి… నీ నవ్వులో నన్ను  నేను  మరిచిన  క్షణాలు అనంతం...నీ చూపుల్లో  నా  హృది  తేనెలొలుకుతుంటే  ఆస్వాదిస్తూ  మైమరిచిన  పిచ్చిదాన్ని .  నా  శ్వాస..నా  ఆశ  నా  ప్రాణం అన్ని  నువ్వే …ఈ  విషయం  నీకు  తెలుసు .  నీకు చాల చెప్పాలి...నన్ను న

reply

                                                                              Written by Bhanuchandara   ఒరేయ్ ! నీ చిరునవ్వులతో ఎదనిండా గులాబీల మాల వేస్తూ...సిగ్గుల ముడులు ఒక్కొక్కటి విప్పుతూ సొగసైన ఓయ్యారాన్ని నాజూగ్గా దోచుకునే సుందరుడా!  గుప్పెడు గుండెల్లో ఘుమ ఘుమల ప్రేమను పేరుస్తూ మేనంతా అల్లకల్లోలం చేసే రాక్షసుడా!  అనందానిస్తూనే....విషాదాన్ని పంచే బ్రహ్మరాక్షసుడా!  ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? ఎంత దుర్మార్గుడువిరా! నువ్వు. నన్ను మార్చావు...నా చిరునామా మార్చావు. ఎవరైనా, నాప్రాణం ఏదంటే నిన్ను చూపించి గర్విస్తాను.... గర్విస్తూనే వుంటాను. రాక్షసి.....

Love Letters

                                                                                                      Written by Bhanuchandara   ఓహ్ మై డియర్! మృదు మధురమైన గులాబీ రెక్కల సోయగమా! మందారపు దరహాసమా! నా హృదయములో విరబూసిన పారిజాత పుష్పమా!  లేలేత వెలుగుల కిరణమై నా హృదయ కవాటములో ఒదిగిపోయిన ఆనందమా! సదా నిన్ను స్మరిస్తూ....నీ చిరునవ్వుల ముంగిట్లో...నన్ను నేను మైమరుస్తూ...నీ కళ్ళలో వెలుగునై…మత్తుగా...నీ చక్కిలిపై అరుణిమనవుతూ, నీ అధారాల్లో చేరి, అది మధురం..దధి మధురమంటూ, నిన్ను మురిపెముగా లాలిస్తూ, నేను..నేను కాకుండా నువ్వై పోయిన నేను, నువ్వు..నువ్వు కాకుండా..నేనైపోయిన నువ్వు, ఆ క్షణం…ఆ నిముషం..ఎంత అద్భుతం. బహుశా నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో!  ఏ జన్మ బంధమో ఈ జన్మలో నీ పరిచయం...నీకు జన్మ జన్మల రుణపడివుంటాను.   ప్రేమతో