Love letter 1
Written by Bhanuchandara
ఒరేయ్
ప్రేమ ఓ అద్భుతం …అది అనిర్వచనీయం.
ఈ అద్భుతమైన ప్రేమే మనిషిని …మనసును ఊపిరాడనివ్వకుండా చేస్తుంది.
ఈ అద్భుతమైన ప్రేమే మనిషిని …మనసును ఊపిరాడనివ్వకుండా చేస్తుంది.
ఈ అద్భుతమైన ప్రేమ నర ..నరాన్ని మెలేసి ప్రాణాన్ని తోడేస్తుంది.
ఎంతైనా అద్భుతమైన ప్రేమ కదా!
ప్రతిదీ అద్భుతముగా ఉంటుంది.
అర్థం కాలేదా అదేరా …చంపినా ..బ్రతికించిన …ఏదైనా అద్భుతమే.
ఎస్...రెండు హృదయాల వంతెనపై పారిజాతపూలు పూయించేది ప్రేమ.
ఇద్దరి మనుషులను ఒక తాటిపై నడిపేది ప్రేమ.
జడత్వమునుండి చైతన్యానికి ప్రవహిస్తూ...పరవశించేది ప్రేమ.
సరే అసలు విషయానికొద్దాం.
ఎద నిండిన భావాల భావావేశం నీకు అర్థమవ్వాలని విపులముగా చెప్తున్నా.... అంతకు మించి మరేం లేదు.
అవును మరి…నీ నవ్వులో నన్ను నేను మరిచిన క్షణాలు అనంతం...నీ చూపుల్లో నా హృది తేనెలొలుకుతుంటే ఆస్వాదిస్తూ మైమరిచిన పిచ్చిదాన్ని.
నా శ్వాస..నా ఆశ నా ప్రాణం అన్ని నువ్వే …ఈ విషయం నీకు తెలుసు.
నీకు చాల చెప్పాలి...నన్ను నేను ఆవిష్కరించటానికి ఈ లేఖ దోహద పడుతుందని ఆశిస్తున్నాను.
కానీ ఏం చేయను బాస్ పిలుస్తున్నాడు. ప్లీజ్ తిట్టుకోకుండా నా గురుంచి వెయిట్ చేస్తావని...
నీ నిరీక్షణకు బహుమతిగా నీకో తియ్యని ముద్దు.
Continuous..........






Comments
Post a Comment