reply
Written by Bhanuchandara
ఒరేయ్ !
నీ చిరునవ్వులతో ఎదనిండా గులాబీల మాల వేస్తూ...సిగ్గుల ముడులు ఒక్కొక్కటి విప్పుతూ సొగసైన ఓయ్యారాన్ని నాజూగ్గా దోచుకునే సుందరుడా!
గుప్పెడు గుండెల్లో ఘుమ ఘుమల ప్రేమను పేరుస్తూ మేనంతా అల్లకల్లోలం చేసే రాక్షసుడా!
అనందానిస్తూనే....విషాదాన్ని పంచే బ్రహ్మరాక్షసుడా!
ఇన్ని రోజులు ఎక్కడున్నావురా?
ఎంత దుర్మార్గుడువిరా!
నువ్వు. నన్ను మార్చావు...నా చిరునామా మార్చావు.
ఎవరైనా, నాప్రాణం ఏదంటే నిన్ను చూపించి గర్విస్తాను.... గర్విస్తూనే వుంటాను.
రాక్షసి.....
Comments
Post a Comment