Love Letters
Written by Bhanuchandara
ఓహ్ మై డియర్!
మృదు మధురమైన గులాబీ రెక్కల సోయగమా!
మందారపు దరహాసమా!
నా హృదయములో విరబూసిన పారిజాత పుష్పమా!
లేలేత వెలుగుల కిరణమై నా హృదయ కవాటములో ఒదిగిపోయిన ఆనందమా!
సదా నిన్ను స్మరిస్తూ....నీ చిరునవ్వుల ముంగిట్లో...నన్ను నేను మైమరుస్తూ...నీ కళ్ళలో వెలుగునై…మత్తుగా...నీ చక్కిలిపై అరుణిమనవుతూ, నీ అధారాల్లో చేరి, అది మధురం..దధి మధురమంటూ, నిన్ను మురిపెముగా లాలిస్తూ, నేను..నేను కాకుండా నువ్వై పోయిన నేను, నువ్వు..నువ్వు కాకుండా..నేనైపోయిన నువ్వు, ఆ క్షణం…ఆ నిముషం..ఎంత అద్భుతం. బహుశా నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో!
ఏ జన్మ బంధమో ఈ జన్మలో నీ పరిచయం...నీకు జన్మ జన్మల రుణపడివుంటాను.
ప్రేమతో
Comments
Post a Comment