Love Letter 24

 

                            

                                                                               Written by Bhanuchandara


డియర్ 

"జె ఓస్ ఐమే"..దీని అర్థం నీకు తెలుసుగా..ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్లా ఎంత ఘాటుగా ఉంటుందో...  ప్రపంచములో ఎన్ని వేళ సార్లు చెప్పిన బోర్ కొట్టని పదం ఇదొక్కటేనేమో!

                                                       


         

నిన్న కావ్య వాళ్ళింట్లో పంక్షన్ ఉంటె వెళ్ళాను..ఎన్నాళ్ళో నుండో ఎదురుచూస్తున్నట్లు నేను వెళ్ళగానే డాలీ ఎగురుకుంటూ వచ్చి నాపై  యెగిరి దూకాడు. పక్కన అందరు వాడిని చూసి నవ్వుతున్న పట్టించుకోకుండా నా చెక్కిలిపై సుతారంగా ముద్దు పెడుతూ నా చేతులు స్పర్శిస్తూ ..నా కాళ్ళను అభిషేకిస్తూ ..నా చుట్టూ ప్రదక్షిణ చేస్తూ..నా దగ్గరికి ఎవరిని రానీయకుండా నాకు కాపలాగా నా దగ్గరే కూచున్నాడు. 

                                                         

నా గుండెలో దాగిన దుఃఖం వెల్లువై పొంగింది.

నన్ను గమనించిన కావ్య నన్ను గుండెలకు హత్తుకుంటూ వైన్ తీసుకొచ్చి ఇచ్చింది. వద్దనకుండా మెల్లగా తాగుతున్నాను..దానికి(వైన్)  నా గుండె భాధ తెలిసిందేమో.... నాలోని బాధల మంటను ఉపశమింపజేస్తూ తను..తనలోని వేడిని చల్లార్చుతూ నేను....ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ఆనందాన్ని పంచుకుంటుంటే ఇంతలో శేఖర్ వచ్చి మా ఆనందాన్ని భగ్నం చేసాడు.

                                                    


హాయ్ అంటూ పక్కన కూచున్నాడు...నేను విష్ చేశాను.

ఎలా ఉన్నాడు? మన హీరో..అంటూనే, అయినా నీకు తగినవాడు కాదు. ఎంచుకునేప్పుడే సరి అయిన వాడిని ఎంచుకోవాలి. ఆడవాళ్ళలో సగం మంది ప్రేమ ప్రేమ అంటూ ప్రేమ వెనుకాల పడతారు. ప్రేమలో ఏముంది? అంటూ హేళన చేస్తుంటే తట్టుకోలేక పోయాను.

శేఖర్ ఎన్ని సార్లు అవహేళన చేసిన మాట్లాడని నేను గ్లాస్ లో ఉన్న మొత్తం వైన్ ఒకేసారి తాగి  బదులు చెప్పాను. 

                                                        



తగిన వాడు అంటే నీ ఉదేశ్యం..ఆస్థి..అంతస్తులా? లేక సమాజములో స్టేటసా?

అవి ఏవైనా సరే  ఈవేళ ఉంటె రేపు పోతాయి.

ఒక్కసారి వాడితో మాట్లాడు..వాడు ఏ పనైనా సరే..ఎంత పద్దతిగా చేస్తాడో..ఆఖరికి ఇల్లు ఉడ్చినా సరే..చాల అద్భుతముగా చేస్తాడు.

ప్రేమను పక్కను పెట్టు...పెళ్లి చేస్కుని నటించడం మంచిదా! జీవించడం మంచిదా!

నేను మాత్రం జీవించాలనుకుంటున్నా....అందుకే నేను ప్రేమిస్తున్నా

                                                        


     

ప్రేమలో ఏముందంటే వలపేరుంగక బ్రతికి కులికి మురిసేకంటే వలచి విఫలమొంది విలపింప మేలు అన్నాడో కవి. ప్రేమిస్తే.... ప్రేమలోని రుచి మరింత తెలుస్తుంది.                                

ఇంతలో కావ్య వచ్చి మొట్టికాయలు వేస్తూ శేఖర్ ను పక్కకు తీసుకెళ్లింది.

డాలీ మాత్రం నా కాళ్ళ దగ్గర తోక ఊపుకుంటూ అలానే పడుకుంది.

                                                            

    

ఇంతలో ఒకరి తరువాత ఒకరు వస్తున్నారు..అందరూ నన్ను విష్ చేస్తున్నారు.

వాళ్ళు వాళ్లతో పాటు లోట్టేంకాయలు(పిల్లలు)...ముద్దులొలుకుతూ.      

మనకు పెళ్లి అయుంటే మనకు ఓ బుడంకాయ్ ఉండేవాడు.

                                                        



వాడు వచ్చి రానీ బుడి బుడి అడుగులతో నడుస్తూ మిన్ను మన్ను ఏకం చేద్దామన్నంత హడావుడిలో వాడుంటే..మనమేమో వచ్చిరాని నాట్యముతో వాడిని మెప్పించబోయి.. నడుములు విరగ్గొట్టుకున్నప్పుడు వాడు నవ్వులు రువ్వుతుంటే...వాటిని వాత్సల్యముతో ఒడిసిపట్టుకుంటూ మనిద్దరం...  

Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6