Love Letter4
Written By Bhaanuchandara
రేయ్
మృదుమధురమైన ముద్దుల తోరణాలతో భానుడిలా భగ భగ మండిపోతున్నావా!
సరేలే..వేడిని చల్లార్చే కథ చెపుతాను.
ప్రభాత వేళ నేను నడుస్తుంటే...సూర్యుడు తన లేలేత కిరణాలతో నన్ను స్పృశిస్తూ చుట్టేస్తుంటే ..అంతలోనే చల్లగాలి చిలిపిగా చెక్కిలిపై చేరి సయ్యాటలాడుతుంటే...పరవశాల చక్రపొంగలి సేవిస్తూ..చవులూరగా ఆస్వాదిస్తూ...నయనాల్లో దాగిన నీ రూపం నను ఉడికిస్తుంటే..ఉడుక్కుంటూ ..చిరుకోపం నటిస్తూ నేను.
అంతలోనే ఇంద్రధనస్సు మనిద్దరిని తన వడిలోకి చేరదీసి సప్తవర్ణాల శోభని....ఆనందోబ్రహ్మ యొక్క అంతరార్థన్ని వివరిస్తుంటే..మనిద్దరం ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకుంటూ నవ్వుకుంటుంటే....ఆకాశం తెల్లబోయి అంతలోనే తెప్పరిల్లి........ఆనందముతో చినుకై వర్షిస్తుంటే...మనిద్దరం తడుస్తూ. ఒకరి చేయి ఒకరం పట్టుకుని నాట్యమాడుతుంటే ఎంత బాగుంది.
ఊహే ఇంత మధురమైతే..వాస్తవం మరెంత మధురాతి మధురమవుతుందో ఆలోచించు.
అన్నట్లు నాలో అందమెక్కడుందో తెలుసా!
ఒరేయ్ పిచ్చి మొద్దు ఏమిటి తెల్లమొహం వేసుకు చూస్తున్నావు...అదేరా నా అందం ..నా నడకలోనా..నా నడుములోనా...లేక నా కళ్లలోనా..నా చూపుల్లోనా..నే కట్టే చీరలోనా లేక నా శరీరమా!
అందమెక్కడుందో చెప్పగలిగితే ఒక రోజంతా గదికి తాళం వేసి గందరగోళం చేద్దాం.
ఆలోచించు రేపటివరకు....
Comments
Post a Comment