Love Letter 11
Written By Bhaanuchandara
రేయ్
నన్ను చూడగానే నీ కళ్ళల్లో ఎన్ని మెరుపులు..ఎన్నెన్ని మైమరుపులు.
నీ మెరుపుల మైమరుపుల్లో... నేను తారనై తళుకులీనుతుంటాను.
నీకు నాకు ఏమిటి బంధం...ఎక్కడ కలిసింది ఈ సంబంధం.
ఎన్ని సార్లు ఆలోచించానో?
ప్రశ్న తప్పితే జవాబు లేదు.
ఈ బంధాల అనుబంధాల పరిష్వంగములో ఒకరికి తెలియకుండా మరొకరం కరిగిపోయేవారం.
గంటలు క్షణాలయ్యేయి..రోజులు గంటలయ్యేయి.
మనిద్దరి మధ్య కొన్ని సమయాలు మౌనమే రాజ్యమేలుతుండేది...ఆ రాజ్యములో జాబిల్లి ఒడిలో నే..విశ్రమిస్తే నువ్వు నాకు సేవ చేస్తుంటే..నేను అరమోడ్పు కనులతో నిను కవ్విస్తుంటే..ఎర్రని కనులతో ఎదలో చేరి పయ్యెద బరువును తొలగిస్తూ..నాలోని తాపాన్ని మాయం చేసే నువ్వు నిజముగా మంత్రగాడివి.
ఆ క్షణములో..మనిద్దరి కనులు మధురమైన ఊసులతో..ఎన్నెన్ని బాసలు..ప్రతిన పూనేవి.
ఎప్పుడైనా నేనలిగితే నా పెదవుల్లో మధురమై.. మధువొలికిస్తూ..వెన్నెల కతలెన్నో కైత కట్టి మరి మరి వినిపించేవాడివి.
అరేయ్ తలచుకుంటుంటే గుండె బరువుగా మోయలేనంత భారముగా ఉంది.
నిన్నెప్పుడు నేను కరువుదీర కౌగలించుకుంటానో..?
ఎప్పుడు నాలోని భారాన్ని దించుతావో...??
క్షణాలను లెక్కిస్తూ..నీ చుట్టే ప్రదక్షిణం చేస్తున్నా...!
Comments
Post a Comment