Love Letter 13
Written By BhaanuChandara
నిన్నటి నుండి ఎదురు చూస్తున్నాను.
నువ్వు వస్తావని. ..
పరిగెత్తుకుంటూ వచ్చి నను సరప్రైజ్ చేస్తావని..
నీ సమక్షంలో... మన కలయికకు చిహ్నముగా ఆకాశ వీధుల్లో జెండా ఎగురేయాలని..
ఎన్నో... ఎన్నెన్నో కలలు కన్నాను.
కడలి హోరులో ప్రేమ కలలు అలలై ఎగెసెగిసి పడ్తుంటే..నను హత్తుకుని ఓదార్చిన కన్నీటి సంద్రం.
ఈ సంద్రాన్ని ఈదలేక..ఈదటానికి చేతకాక అలాగే..అక్కడనే
ప్రియా! ఎదలోని భావ తరంగాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే..మానస సరోవరంలో దాగిన మొసళ్ళు..విష సర్పాలు నను గాయపరుస్తూ కాటేస్తుంటే...అచేతనావస్థలో.. జడత్వమై కూలబడిపోయా!
నీ స్పర్శ కోసం..నీ ప్రియా భాషణం కొరకు
మిత్రమా
నువో పరి నా వైపు తిలకిస్తే...మధురమవుతావు.
లోలోపలికి నా కన్నుల్లోకి చుస్తే కాంతివై వెలుగవుతావు
నా మాటల్లో పలుకువైతే కులుకులొలుకుతావు.
నా శ్వాసలో చేరితే మధురాసాలతో సరసాలు కురిపిస్తావు
నా గుండెలో నివసిస్తే గులాబీల వికసిస్తావు
నా అడుగులో అడుగేస్తే ఏడడుగులేస్తు నను చుట్టుకుపోతావు
నా హృదిలో తొంగి చేస్తే ప్రేమై పోతావు
ఇన్ని మాటలెందుకు.
నువ్వు నేను మాయమై మనం గా మిగిలిపోతాం.
ప్రియా ఎదురుచూస్తున్నా......నీ కోసం..నీ రాక కోసం.
కల్లు సోలిపోతున్నా..పలుకు పెదవి దాటకున్న ..నడక తడబడుతున్నా..తనువూ భాదించినా..ఎవరు వేధించిన
లేని ఓపికను కూడగట్టుకుని నీ కోసం..నీ రాక కోసం
నిలువెల్లా కనులై....వెన్నెల్లో నిను చేరగా... ఈ ప్రేమికా చూస్తూనే ఉంటుంది.
ప్రేమిస్తూనే ఉంటుంది.
Comments
Post a Comment