Love Letter 14
Written By Bhaanuchandara
మల్లి మల్లి వినాలన్పించే మన ప్రణయ గాధలెన్నో..
మనిద్దరం పదో తరగతి చదివిన రెండు సంవత్సరాల కాలం తరువాత మనం కలుసుకున్న విషయం గుర్తుందా!
లేలేత కిరణాలతో సూర్యుడు ప్రభవిస్తుంటే ఆ ఉషోదయానా.. మనిద్దరం నువేమో నూనూగు మీసాల కోర చూపులతో...దొంగ చూపులు చూస్తూ నువ్వు...నేనేమో నా లలిత లలితమైన లాలిత్యానికి మరింత వన్నెలు రంగరించి ఉన్నానేమో!
నీ వైపు చూడలేక సిగ్గుల మొగ్గవుతుంటే..
మనిద్దరం ఒకరికొకరం..ఇంకొకరికి కొత్త కొత్తగా వింతగా కన్పిస్తుంటే..కవ్వింతలన్నీ చుట్టుముట్టేస్తూ చక్కిలిగిలి పెడ్తున్నవేళ.
నువేమో అల్లరిగా నవ్వుతూ "గయ్యాళి" బాగున్నావా! అంటూ నన్ను పట్టి పట్టి చూస్తుంటే నాలోని ఆడతనం మరింత అందముగా ప్రకాశిస్తూ చూపులతోనే సమాధానమిస్తుంటే నువేమో మాటలు మర్చిపోయినట్లున్నావే అంటూ టీజింగ్ చేస్తుంటే.. నాకెప్పుడూ పరిచయమే లేని నాలోని పులకరింతను నువేమో బయటపడేస్తుంటే..
నీ ముందు నాలోని అందమైన పరవశాన్ని బహిర్గతం చేయలేక లేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించబోయి నవ్వుల పూలను నీపై చల్లుతూ నువెలా ఉన్నావంటూ ప్రశ్నించాను.
నువ్వు అదే నవ్వుల పూలను మరింత పరిమళ భరితం చేసి నాపై జల్లుతూ ఇదుగో ఇలా అంటూ మరింత దగ్గరకి చేరువై గుస గుసలాడ్తుంటే నేనేమో నీ మేను గుబాళింపుల మత్తులో.....
అది రోడ్..పది మంది మనల్నే చూస్తున్నారు అనే ధ్యాసే లేదు.సూరీడు ఎండనే వెన్నలగా
అలానే ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ..నవ్వుకుంటూ...మధ్య మధ్యలో పొడి పొడి మాటల సుగంధాలను పూసుకుంటూ...
సరేలే మీ సంబడమంటూ భానుడు భగ భగ మండుతూ మనిద్దరిపై విరుచుకుపడ్డాడు.
సూరీడి దెబ్బకు తెలివొచ్చిన మనిద్దరం ఒకరినొకరం విడువలేక..వొదల్లేక ఎవరి గమ్యాలవైపు వారు అడుగులేసుకుంటూ...దృశ్యం. కమనీయం.
Comments
Post a Comment