Love Letter 15
Written By Bhaanuchandara
అల..అల మొదలైన మన స్నేహం చిగురులు వేస్తూ దిన దిన ప్రవర్థమానమై శాఖోపశాఖలుగా విస్తరిస్తూ పరిఢవిల్లింది.
ఎంతగానంటే..అటు మీ ఏడు తరాలు..ఇటు మా ఏడు తరాల అనుబంధమంతగా...
అప్పటివరకు జీర గొంతుతో ధ్వనించే మన కంఠాలు తియ్యని తేనియలు ఒలికించేంతగా...
నయనాల్లో కాంతుల జలపాతం ప్రవహిస్తుంటే..మనిద్దరం వెలుగులు విరజిమ్ముతూ..నింగి నుండి అవనికి..అవనినుండి నింగికి ప్రయాణించేవాళ్ళం.
నువేమో చిరునవ్వుల పూలు విసురుతుంటే నేను వాటిని భద్రముగా ఏరుకుని దాచేదానిని. అది చూసి నువ్వు మరింత నవ్వుతుంటే..వాటిని కూడా నా గుండె అరలో నీకు తెలీయకుండా జాగ్రత్త పరచేదానిని.
అరేయ్ గుర్తుందా.......
ఆనాడు నువ్వు పెట్టిన మొదటి ముద్దు..
ఆ ముద్దులో నా కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే..నువేమో నా వయ్యారపు మత్తులో సోలిపోతూ తనువంతా ముద్దైపోయావు.
ఆ ముద్దుల పులకింతల్లో నా తనువులో గిలిగింతల చక్కిలిగింతలు రేపుతుంటే..నా పయ్యెదపై పవళించి..నను లాలిస్తూ..నను పాలిస్తూ చెక్కిలిపై నీ కొనగోటితో మీటుతూ అల అల నాసికపై నుండి వదనం మధ్యలో ఎర్రగా ఉదయించే సూర్యుడికి పారిజాతం సమర్పిస్తూ..పరవశముతో నేరుగా కంఠం వద్దకు చేరి పరిమళపు హారాలతో అలంకరిస్తుంటే ఇంతలో మన తపస్సును భగ్నం కలిగిస్తూ ఎవరో పిలుపులు.
అది మధురమే కదా!
Comments
Post a Comment