Love Letter 16

 

                                                                                            

                                                                                          Written By Bhaanuchandara                                                    

నువ్వు వస్తావని..వస్తూ..వస్తూ..కొన్ని మల్లెలు..కొన్ని జాజులు...మరికొంచెం మరువం అన్ని రంగరించి నన్ను అలంకరిస్తావని..

అదిరే గుండెలకు సర్ది చెప్తూ...నీ రాక కోసం నిరీక్షిస్తున్నా..

                                                                                       

నీ జ్ఞాపకాల శిథిలాల్లో నే నడుస్తుంటే నిరాశ నన్నావహించి..చెప్పలేని బరువు గుండెలో చేరి నన్ను కూలబడేలా చేస్తుంది.

అదేమీ చిత్రమో! అంతలోనే నీ స్మరణ వేయి ఏనుగుల బలాన్నిస్తుంది...ఆ ధైర్యం నువ్వు పక్కన ఉన్నట్లే తోస్తుంది.

దిగులు పడ్డ కన్నుల్లో కాంతులు చేరగా..గుబులుతో క్రుంగి కృశించిన మనసులో చైతన్యమై..నా అందానికి వన్నె చిన్నెలతో కాంతులీనేలా చేస్తావు. 

                                                            



ఓ ప్రియతమా

ప్రియాతి ప్రియమైనా మానసచోరుడా!

ఏమని చెప్పను...? ఎన్ని చెప్పిన ఎన్నో కొన్ని మిగిలే ఉంటాయి.

ఈ ఎదురుచూపుల్లో ..ఎంత నరకముందో అనుభవించేవారికి తెలుస్తుంది.  

                                                    


    

నిరీక్షణ...నిరీక్షణ...నిరీక్షణ               

ఇది శిక్షో..పరీక్షో అర్థం కానీ విచిత్ర స్థితి 

అయినా ఈ పరీక్షా నీకో..నాకో...కాలానికో అర్థం కానీ పరిస్థితి.

అయినా నువ్వు వస్తావని..ఎడారి లాంటి జీవితాన్ని సస్యశ్యామలం చేస్తావని ఆశిస్తూ..కాటుక కన్నుల్లోని వెన్నెలను "నీ కోసం" దాచి ఉంచా!

                                                        



ఆధారాలపై సిగ్గిల్లగా..మధుర స్వరాలతో హిందోళ..మోహన రాగాలను కలిపి   సుమధురముగా ఆలాపిస్తూ..నీ పరవశములో నే తనువూ చాలించాలని కోరుకుంటున్నా

ఇదే విషయం నా ఫ్రెండ్ కావ్యకు చెపితే "ప్రేమ లేదు దోమ లేదు..అవసరాన్ని బట్టి  మనిషి ఏర్పర్చుకున్న సెంటిమెంట్ "లవ్". దేనికి పనికిరాని వాళ్లే ప్రేమ అంటారు." అంటూ ఈసడిస్తూ  "ప్రేమ పేరుతొ ఎదుటివారిని మోసం చేయటమే..." "అసలు ప్రేమే పెద్ద డ్రామా" అని తను చెప్తుంటే నన్నెవరో అగాధములో తోసేసిన ఫీలింగ్..ఆ భావనను వ్యక్త పరచకుండా నేనక్కడినుండి బయటికి వస్తుంటే "నువ్వా ప్రేమ మాయలో పడితే నిన్నే మాయ చేస్తుంది." జాగ్రత్త అంటూ పెద్దగా నవ్వుతు వెక్కిరిస్తుంటే...లోలోపలికి కూరుకుపోయి మరణమైన నేను.

                                                                


 అంతలోనే నీ స్మరణలో జనిస్తూ..మట్టిని చీల్చుకుంటు భూమిపై వచ్చిన మొక్కలా చిరునవ్వులు చిందిస్తూ ఆకాశమువైపు గర్వంగా చూసాను.


Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6