Love Letter 17

 


                                                                                     Written By Bhaanuchandara


ఏయ్ ఏం చేస్తున్నావు?

ఇక్కడ చల్లగాలి నన్ను పిలిచి సపర్యలు చేస్తుంది.

రేగిన నా కురులను సవరించింది.

కన్నీళ్లతో ఎండిపోయిన కళ్ళను శుభ్రం చేసింది.

స్వేదంతో ఎండిపోయిన నా దేహానికి శుశ్రూషలు చేసింది 

నేనున్నంటూ నన్ను హత్తుకుంది.   

మెల్ల మెల్లగా మంచి చెడ్డ ..నిన్ను నన్ను అన్ని వాకబు చేసింది.

నా లోగుట్టు మొత్తం తెలుసుకుంది. 

                                                                





హృదయ స్వాంతన కోసం  

పక్కనే ఉన్న పక్షులను..ప్రకృతిని...మేఘాలను..రాగాలను అన్నిటిని పరిచయం చేసింది.

వీటి సాంగత్యములో నా ఊహలకు రెక్కలు వచ్చాయి...కాదు కాదు నాలోని మరో మనిషి భావుకతను అడ్డం పెట్టుకుని రొమాంటిక్ శాడిస్టుగా..స్టుపిడ్ గా థింక్ చేస్తూ..

                                                    

"ప్చ్"    

పక్కన నువుంటే మరింత మజాగా ఉండేది...మనిద్దరి శాడిజాన్ని ప్రేమ్ చేసుకుంటూ...దాన్నే చూసుకుంటూ మురుసిపోయేవాళ్ళం.

ఈ చల్లగాలి వేసిన మంత్రములో   

                                                              
 
        

ఎన్నో  కోరికలు నాలో..నా గుండెలో చేరి నన్ను కుదురుగా ఉండనీయకుండా చేస్తుంది.    ఈ ఉద్రేకపు వేడిలో..వెచ్చని శ్వాసల  నియంత్రణలో ..యంత్రాన్నై...నీ స్మరణలో నిన్ను వశపరచుకోటానికి ఎన్నెనో మంత్రాలూ ఉచ్చరిస్తూ...నిన్నే ధ్యానిస్తున్నా

                                                        



ఎన్నో మోషన్స్..ఎన్నెన్నో ఎమోషన్స్ నన్ను ప్రమోషన్ చేస్తున్నాయో డిమోషన్ చేస్తున్నాయో...మొత్తానికి నన్ను డామినేట్ చేస్తూ. 

అక్కడ నువెలా ఉన్నావు.?

అక్కడ కూడా అలానే ఉందా!

                                                        


                    

ఊపిరాడక..ఉన్న ఊపిరిని ఎవరో లాగేస్తున్నట్లు ఉందా?

కొత్త కొత్తగా..వింత వింతగా ఎప్పుడు లేని మత్తుగా ఉందా!

ఊపిరి బరువెక్కుతుంటే...ప్రాణం ఎవరో లాగేస్తునట్లుందా?

గుప్పెడు గుండెను ఎవరో నొక్కేసినట్లుందా

జాగ్రత్త ..కొద్దిగా మంచి నీళ్లు తాగు..అది అన్నిటిని సరిచేస్తుంది.

కళ్ళల్లో నీళ్లు... ఏమిటి.? పొలమారుతుందా! చిన్నగా తాగు      

                                                    


నీ వెన్నంటి నేనున్నాగా!

ఏడుస్తున్నావా! చిన్నపిల్లాడిలా...బాలేదు. 

ఇదుగో కౌగిలి..అన్ని మరచిపో సరేనా!

ఏమిటి మారం. 

ముద్దు కూడా కావాలా! సరేలే అంతగా అడగక్కర్లేదు.

ఇదుగో తియ్య తియ్యని ముద్దు


Monitoring

Personality Scent

https://basuvula.blogspot.com/2023/01/blog-post_3.html

Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6