Love Letter 18

     

                                                                        Written By Bhaanuchandara 



ఏదో దిగులు గుండెలో చేరి ఊపిరాడనీయకుండా చేస్తుంటే..అలవి మాలిన అనురాగముతో పెనవేసుకున్న ప్రాణాన్ని ..జో కొట్టలేక..నిను వదలలేక జీవచ్ఛమయ్యాను.

                                                    


ప్రభాతాన సూర్యోదయపు వేళలో కోయిల రాగాలు..రామచిలుకల పలుకులు నాలో ఆశని నింపేస్తుంటే ఆకాశమంత నేనై యెర్రని రవిలా వెలుగుతూ నీ దరి చేరాలని వడి వడిగా అడుగులు వేసుకుంటూ నేనొస్తుంటే నువేమో సంధ్య సమయాన నిశిలా నానుండి దూర దూరముగా ఉంటూ నాలో నిరాశను నింపేస్తావు. 

                                                         


           

                                              

హృదయ సామ్రాజ్యాన్ని ఏలే మహారాజ వందనాలు...

వేవేల సూర్యుల తేజస్సును నింపుకున్న మహా ప్రభువు నీకు శతకోటి వందనాలు.

మందార మాలను సుగంధాలతో నింపి నీకోసం స్వాగతం పలుకుతున్నా..

గులాబీల గుభాలింపుల్లో సిగ్గుల మొగ్గలు కలిపి నీ కోసం ఎదురు చూస్తున్నా..

మల్లెల మత్తులో మధురాతి మధురమైన తియ్యందనాన్ని నీ కోసం దాచిపెట్టా...

                                                              


 

ఇది ఏమైనా బాగుందా!

ఏడేడు గుర్రాలపై ఏకవీరలా వస్తావని 

జన్మ జన్మల బంధాన్ని బలీయం చేస్తావని 

కలకంఠి కన్నులకు శోభను తెస్తావని

ప్రేమకు మరణం లేదని

లోకమంతా చాటి చెపుతావని నిరీక్షిస్తుంటే...నువేమో .............?

ప్రశ్నార్ధకమై ..గగనములోని చుక్కల వెనుకాల దాగుండిపోయావు.      

                                              


                  

ప్రేమంటే ఇంతేనా.....! ప్రేమిస్తే ఇంతేనా........!

శోకం తప్ప ఇంకేమి మిగలదా.......

నా కన్నీటి ధారలతో నిన్నభిషేకిస్తూ ...వేచి ఉన్నా..!

ఎన్ని జన్మలైనా ఎదురుచూస్తూనే ఉంటాను.

                                                


Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6