Love Letter 21
Written By Bhaanuchandara
అరేయ్
ప్రేమ..ప్రేమ..ప్రేమ
ఏముందో..ఏమో...!
కానీ..పేరు వింటే ఎద పొంగుతుంది.
చిన్నపిల్లలమై కేరింతల్లో మునిగిపోతాం.
కనులు మణులై...ప్రకాశమై పరవశిస్తాయి.
వదనం చంద్ర బింబమై వెన్నెలొలుకుతుంది.
ఎన్నెనో మధుర కధల సుధల్లో సుమధురమవుతాం.
వెన్నెల..పూలు వలపులై చక్కిలిగింతలు పెడతాయి.
చిరునవ్వుల కాంతుల్లో తడిసిపోతూ..చిదంబర రహస్యమవుతాం.
దేహం ప్రేమాలయమై ఒకరి గుండెలో ఇంకొకరిని పూజిస్తుంది.
అంత పవిత్ర ప్రేమను క్షణికావేశములో కాల్చేస్తున్నాం...మనల్ని మనం హింసించుకుంటున్నాం.
అర్థమైందా...! డియర్...!
ఎన్నో చెప్పాలని..ఏవేవో విషయాలు నీతో మాట్లాడాలని అనుకుంటానా..!
ఏమి చెప్పలేక..ఎద బరువెక్కి..కనులు వర్షిస్తుంటే.....
మనసు అంతఃకరణలో దాగిన రహస్యాల ముడులు జాగ్రత్తగా విప్పుతూ..జో లాలీ పాట పాడుతుంటాను
గిల్లికజ్జాలు పెట్టుకుని చిలిపిగా చుట్టేయడం.
ఇంటి ముందు నే..ముగ్గులేస్తుంటే..నన్నే చూస్తూ నిను నువ్వు మరచిపోడం
పది మందిలో ఉన్నప్పుడు పనికట్టుకు పలకరించి..ఎవరు చూడకుండా ముద్దెటడం.
నెలవంకను చూసి కళ్ళుమూసుకున్ననువ్వు.. నేననుకొని మా అమ్మమ్మను కౌగలించుకోడం.........
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో..ఎన్నెన్నో పరిమళాలు చుట్టుముట్టేసి గుభాళిస్తుంటాయి.
ఈ గుభాలింపుల్లో మనసు ఎంతో హాయిగా ఉంది.
నువేమో నను మరిచిపొమ్మంటూ..నేనేమో నిను మరువలేక...
పోనీ నువ్వు ..నేను లేకుండా జీవించగలవా..!
జీవిస్తున్నాను కదా అంటావా.........!
జీవించడమంటే...బరువుగా ..భారముగా..నిస్తేజముగా..జీవచ్ఛవంలానా
నీతో పాటు నేను..మనతో పాటు... మన పెద్దలు అందరం.. స్మశాన వైరాగ్యములో కొట్టుకుపోదామా!
భూమాతనై నీ కోసం ఎదురు చూస్తున్నా
Comments
Post a Comment