Love Letter 25

 

                                                                        Written by Bhaanuchandara


ఆ నైట్ కావ్య వాళ్లింట్లోనే నిదురపోయాను.

ఉదయమే లేచి నేను తయారవుతుంటే...కావ్య తరువాత వెల్దువులే అంటున్న వినకుండా బయల్దేరుతుంటే..నా వెనుకే డాలిగాడు కూడా ప్రదక్షిణ చేస్తూ..

నేను వెళ్లొదన్నట్లు ఒకటే అరుస్తున్నాడు.

                                                          
         
                                           

నేను వెళ్లి వాడికి ముద్దిస్తుంటే తప్పదా! అన్నట్లు కుయ్ కుయ్ అంటూ మూలిగింది.నేను తప్పదన్నట్లు నవ్వాను. అది బేలగా నా వైపే చూస్తూ నుంచుంది. దాని చూపులు అచ్చం  నాలానే ఉన్నాయి. అయిన నన్ను..నేను తమాయించుకుని బై చెపుతూ బైటికి వచ్చి కార్ ఎక్కాను.   

కార్ లో కూచున్నానన్న మాటే కానీ...నా చుట్టూ శూన్యం..కళాకాంతుల్లేని జీవితములో ప్రయాణిస్తూ నేను.

కన్నీళ్లు పలకరిస్తుంటే కరిగిపోతూ నీరవుతున్నాను.

                                                                                


ఇంతలో కావ్య దగ్గర నుండి ఫోన్... ఇంతలోనే ఫోనా అనుకుంటూ ఆశ్చర్యముతో ఫోన్ ఎత్తి చెప్పవే అంటుంటే....ఎక్కడున్నావు?...హా... నేను  అంటూ ఒక్కసారి చుట్టూ చూసి గచ్చిబౌలి లో ఉన్నానంటుంటే..అప్పుడే అక్కడికెళ్ళిపోయావా! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

వెంటనే తను నువ్వు జాగ్రత్తే అంటుంటే..నాకేమైందే..మీరందరు ఉన్నారు. కదా! 

                                                                



మేమందరం ఉన్నామంటావు..ఏది మనసు విప్పి చెప్పవు.

ఎవరు లేనట్లు నీలో నువ్వే రోదిస్తూ...నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు..అంటుంటే

"ఆబ్బె అదేం లేదే." అంటూ బదులు చెప్పాను.

రాత్రి ఫుల్ బాటిల్ మందు తాగి...డాన్స్ వేస్తూ..మద్య మద్యలో ఏడుస్తూ..ఏడుస్తూనే డాలీ గాడిని వాటేసుకుని... నాని ..నాని అంటూ కలవరిస్తూ... అలానే డాలీ పక్కనే పడుకున్న నిన్ను.. నేను తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడుతుంటే..వచ్చావా! నాని అంటూ నన్ను గట్టిగ కౌగిలించుకున్న నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోయుంది.

                                                                      


         

ఇలానే నిన్ను వదిలేస్తే నువ్వు మాకు దక్కవే అంటూ దుఃఖం నిండిన గొంతుతో తను చెప్తుంటే నేను మౌనముగా ఉండిపోయాను.

నా బాధను అందరిలో పలికిస్తున్నానా...అందరిని నేను బాధ పెడ్తున్నానా 

చ్చ ....ఇంకెప్పుడు యిలా ఒళ్ళు మరిచేలా మందు తాగకూడదు....ఆలోచనల్లో నేను.

కొద్దిసేపటికి తెప్పరిల్లిన నేను……..       

సారీ నే నీకు శ్రమిచ్చాను అంటుంటే..ఇంకోసారి సారీ చెప్పావంటే చంపేస్తా! నిన్ను వాడెక్కడున్నాడో చెప్పు ...నేను పోయి మాట్లాడుతా అంటుంటే సరేనంటూ "ఉ" కొట్టాను.

                                                                                



అరేయ్ బదులు  చెప్పవేందిరా!

"తే  క్విఈరో" అంటూ స్పానిష్ లో అయిన చెప్పారా! 

Comments

Popular posts from this blog

Love Letter 30

Love Letter 29

Love Letter 27