Love Letter 5

  

                                                                                        Written By Bhanuchaandara 



అందమెక్కడుందో తెలుసుకోలేక తికమకపడిపోతున్నావా!

సరే...మరో రోజు తీసుకుని తీరిగ్గా చెప్పు...  ప్రశ్నార్థకంగా చూడకు.

నీకేదో చెపుదామని అనుకుంటుంటే...చటుక్కున నా అందాల పెదాలపై చేరి సీతాకోకచిలుక గట్టిగా కొరికింది ...అది కుట్టినందుకో లేక నీ తలపుల్లో నేను తేలుతున్నందుకో కానీ అసలే ఎర్రటి పెదవులు మరింత ఎర్రగా తయారయ్యాయి. 


ఎవరైనా పెదవులను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు..

అక్కసుతో లేనిపోని అభాండాలు వేస్తె సమాధానం ఏం చెప్పాలి. 

లేదా..నువేదో చేశావనుకుంటు..పరిహాసాలాడితే బదులేం చెప్పాలి.

అబ్బా!...తలచుకుంటుంటే సిగ్గేస్తుంది. 



అదేం మాయో!...నీ రూపం జ్ఞప్తికి రాగానే సడి చేయని నా పెదవుల్లో నవ్వుల పూలు పరిమళిస్తూ..నే.. పరవశిస్తుంటే..నన్ను చుసిన ప్రతి ఒక్కరు పిచ్చిదాని కింద జమకడ్తున్నారు.

ఇద్దరికే తెలిసి మూడో వ్యక్తి కి పిచ్చిగా కనపడేదే కదా!... ప్రేమంటే....

నువ్వుకూడా...నన్ను చూసి నవ్వుతున్నావా! 

చి ..పో.. ఇదుగో! నేను అలిగాను..చూడు నా బుంగమూతి. నేనేదో చెప్తుంటే నువ్వు నవ్వుతున్నావు.





అసలేం బాలేదు..మనసుకి మాత్రం హాయిగా ఉంది.    

నీ నవ్వుల వర్షములో...నే... తడిసి ముద్దైపోతూ...మురిసిపోతున్నాను.

నీ నవ్వుల్లో.. నా వదనం చంద్రబింబమై పౌర్ణమి నాటి చంద్రునిలా వెలుగుతుంది.

అదే నువ్వు నేను కలిసుంటే ప్రతి రోజు పున్నమే కదా!

పౌర్ణమి రేయి వెన్నెల్లో..కడలి అంచుల్లో..జాబిలి సాక్షిగా వెన్నెల ధారల్లో తడుస్తూ...సుధను గ్రోలుతూ...ధది  మధురమంటూ...ప్రపంచాన్నే మరిచిపోయి జీవిస్తే...?




 

వావ్! యెంత అద్భుతముగా ఉంటుంది.    

ఆలోచించు..నీకు నేను..నాకు నువ్వు 

ఇద్దరం ఒకటైతే మరింత బాగుంటుంది.

చూడచక్కని జంటలా ఉంటుంది.

నాలో అందమెక్కడుందో ఇప్పటికైనా తెలుసుకున్నావా

ఆలోచించు...     



Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6