Love Letter 8
Written By Bhaanuchandara
"ఈ వేళలో నువ్వు ఏం చేస్తూంటావో..." అనే పాట పాడుతూ పరవశిస్తున్న ..నాకు నన్ను చూడగానే నువ్వు పాడే పాట "ఏ దివిలో విరిసిన పారిజాతమో .." గుర్తొచ్చింది.
యెంత అందముగా పాడే వాడివి.
జాలువారే నీ స్వరములో .. నే మైమరుస్తూ అట ఆడుతుంటే ..ఆ ఆనందంలో నువ్వు తడుస్తూ..పులకింతల పూల వానలో అభిషేకిస్తూ నను చుట్టేసే నువేమైపోయావు?
వెన్నెల్లో.. వేణు గాన స్వరములో.."రానన్నది..రాధా రానన్నది..శ్యామ సుందరుడు ఎంత వేడిన..." అని నువ్వు పాడ్తుంటే..ఉన్నఫలంగా ఎన్ని పర్యాయాలు పరిగెత్తుకుంటూ రాలేదు.
ఈ జ్ఞాపకాల దొంతర వైపు నుండి వీస్తున్న గాలులు నను చుట్టుముట్టేస్తుంటే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న..ఒక్కొక్క తియ్యని తీపి గుర్తు హాయిని..ఆనందాన్ని ఇస్తుంటే..అవన్నీ మల్లెపూల పరిమళమై తనువంతా ఆక్రమిస్తుంటే...మనసు ఒక్కొక్కటి పదిలంగా తీస్తూ నెమరేస్తుంటే....ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూ... అంతే జాగ్రత్తగ మదిలో పదిలంగా భద్రపరుస్తూ...ఎంత మధురం..మరెంత మధురాతి మధురం.
Comments
Post a Comment