Love Letter 9
Written By Bhaanuchadara
అప్పుడప్పుడు...
నా ప్రేమను ఎలా వ్యక్త పర్చాలో తెలియక పది మంది మధ్యలో నీపై జోకులేసేదాన్ని.
నువేమో తేలిగ్గా తీసుకోకుండా నీలో నువ్వు మధనపడ్తుంటే ..అనవసరముగా నిన్ను ఇబ్బంది పెట్టానే అని నన్ను నేను తిట్టుకునే దాన్ని.
అప్పుడప్పుడు నీతో గొడవ పడాలని...ఆ గొడవ తారాస్థాయిలోకి చేరినప్పుడు నీ గుండెలపై తల ఆనిచ్చి హ్యాపీగా నిద్రపోవాలని చిన్న కోరిక.
అదేమిటో..అప్పటివరకు జాను..జాను అంటూ వెంట తిరిగే నువ్వు ఫ్రెండ్స్ రాగానే తోక ఊపుకుంటూ వెళ్ళిపోతావు.
కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పవు.
నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు చెప్పకుండానే నేను పక్కకు తప్పుకుంటున్నాను కదా!
అలానే అపుడప్పుడు నువ్వు డ్రింక్ చేద్దామనుకున్నా ప్రతి సారి నీకు దూరముగా వెళ్ళిపోయిదాన్ని కదా!
నిన్నెప్పుడైనా ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించానా? నువ్వు చెప్పింది వింటూ ఉ కొట్టడం తప్ప..
ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నా వైపు చూడవు...నేనెవరో తెలియనట్లు...కళ్ళు ఎటో తిప్పేస్తావు.
బహుశా నా వైపు చుస్తే నీ ఫ్రెండ్స్ కి మన విషయం తెలిసిపోతుదని భయమేమో.
అవును మరి ఒక్కడివే ఉన్నప్పుడు మాత్రం కంటిలో పత్తి కాయల్లేసుకుని నన్ను తినేసేలా చూసే నువ్వు ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు మొఖం తిప్పేస్తావు..మరి నాకు కోపం వస్తుంది కదా!
అసలుకే నేను రాక్షసిని కదా!
ప్రేమ.....ఇది ఏమిటో ఎవరికి అర్థం కాదు...ఎంతగా మరెంతగా వెదికినా ప్రేమలో ఏం ఉందొ..ఏం లేదో ఎందుకిలా పదే పదే ఎద కావాలంటుందో ఎవరికి తెలియదు.
ఇదేమి మంత్రమో! ..ఇదేమి తంత్రమో! సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్లు ప్రేమ చుట్టూ మనిద్దరం గిరగిరా తిరుగుతూ మధ్య మధ్యలో చూపుల సమర్పణలో..ముసి ముసి నవ్వుల సుగంధాల అక్షింతలు ఒకరిపై మరొకరం చల్లుకుంటూ..మనిద్దరి చేతి వేళల్లో ఉన్న విద్యుత్ తరంగాలను ఒకరి నుండి..ఇంకొకరి తనువు లోకి ప్రసరింప చేసుకుంటూ..పరవశాల మధుర రసాలను ఆరగిస్తూ...
ఓహ్! అద్భుతం..మనోహరం.
Comments
Post a Comment