Love Letter2
Written by Bhanuchandara
మొదట తియ్యని ముద్దుతో ఉషోదయం...కాదు కాదు ముద్దోదయం.
ముచ్చట్లు...మురిపాలు వెరసి మైమరపులు.
ఈ మైమరపులకు నిలయం దేహాలయం.
సరే అసలు విషయానికొస్తాను.
దేహంలో అనుభూతులను...అందాల చందనాలను ఎన్నెనో మధుర ప్రకంపనలను ఆధారాల్లో ఒలికిస్తూ .. కన్నుల్లో పలికిస్తూ పెదవుల్లో చేర్చే అద్భుతమైన మధురం..మధురరసం.
ప్రేమ...ప్రేమంటే ఏమిటో ఇప్పటికి నాకు తెలియదు.
కానీ ఒకటి మాత్రం నిజం.
నిను చుస్తే మనసు ఉరకలెత్తుతుంది...నీ చేయిని పట్టుకోవాలని...నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలని....నీ గరుకైన గడ్డానికి.. నా చెక్కిలి చేర్చి ..చక్కలిగింతల పులకింతలు రాగం వినాలని...సూదంటు రాయి లాంటి నాసికను చూపుడు వేలుతో మీటుతూ..నీ బుగ్గపై దిష్టి చుక్క పెట్టాలని ఎన్నో ఎన్నో ఆశలు..ఎన్నో ఎన్నో కలలు.
ప్చ్.....
ఒరేయ్ ముద్దపప్పు....ఏం చెప్పను? ఏమని విన్నవించను?
నేనేమో నిన్ను చూస్తూంటానా!...నువేమో ఎవరినో చూస్తుంటావు.
అదుగో ఆ సమయాన్నే నాకు వీపరీతమైన కోపమొస్తుంది. ఆ కోపములో కుత కుత ఉడుకుతూ గాలి తీసిన బుడగలా బర్రెస్ట్ అవుతాను.
అదేనా ఇంకెన్నో నీ వేషాలు..
నేనేమో పడుతూ లేస్తూ..పరిగెత్తుకుంటూ నేనొస్తే..నువేమో నను కాదని ఎక్కడికో వెళ్ళిపోతావు.
ప్రేమ గురుంచి నీకు తెలియాలని...ఆ తియ్యని భాదను నువ్వు అనుభవించాలని..నీకు ప్రేమ షడ్రుచుల రుచిని పరిచయం చేస్తూ..

Comments
Post a Comment