Love Letter 27

 

                                                                  Written By Bhaanuchandara


అలానే ఇంటికొచ్చి ఫ్రెష్ అయి..అమ్మ చపాతి చేస్తే తినేసి మంచముపై పడుకున్నాను.

"కన్ను మూస్తే నువ్వు..కన్ను తెరిస్తే నువ్వు.

వేధిస్తూ నువ్వు ..శోకిస్తూ నేను    

కవ్విస్తూ నువ్వు..కనుమరుగైన నేను"

                                       

ఏవేవో ఆలోచనలు..ఎదలో చేరి.. వానజల్లులా నను తడిపేస్తుంటే..వాటి నుండి తప్పించుకోడానికి అటు ఇటు దొర్లుతున్నాను.      

...నిద్రపట్టడం లేదు.. లేచి టీవీ ఆన్ చేశాను...అది కూడా చూడబుద్ది కాలేదు...

రిమోట్ ను సోఫాలోకి గిరాటేసాను 

పక్కనే ఉన్న పెన్..బుక్ తీసుకుని కవిత రాద్దామని ప్రయతించా! అది కూడా సాధ్యపడలేదు. పెన్..పుస్తకాన్ని పక్కన పడేసి మల్లి మంచమెక్కి పడుకున్నాను   

ఉహు..ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదు. నా రూమ్ లో సీక్రెట్ గా దాచుకున్న రమ్ సీసాని ఓపెన్ చేసి కొంచెం కొంచెంగా హాఫ్ బాటిల్ కంప్లీట్ చేశాను.    

మత్తులో ఏసి ఆన్ చేసుకుని దుప్పటి కప్పుకుని నిద్రపోయాను.                                                                

మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు లేచాను.

ఆ రోజు ఆదివారం. నీ ఆలోచనలతో పిచ్చెక్కిపోతాననే భయముతో చెడ్డి ఫ్రెండ్ మానసకు ఫోన్ చేశాను.

ఏయ్...ఏం చేస్తున్నావు.? అంటూ గంబీరమైన స్వరముతో అడుగుతుంటే..

ఇదుగో తినటం..కడుక్కోటం..ఈ పనిలోనే జీవితం అయిపోతుందే.

ఏంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు.

నీ దగ్గర కూడా రెస్పెక్ట్ గా మాట్లాడాలా!

ఏయ్ నేను నీ అర్థ మొగుడ్ని గుర్తుంచుకో అంటూ కమాండింగ్ చేస్తుంటే....                                                           

మొగుడు తల్లి నీకో దండం విషయమేంటో చెప్పు...

ఒళ్ళు బలిసిందా! ఏంటి? చికాకు పడుతున్నావు.

పనిలో ఉన్నాను లేవే విసిగించకుండా చెప్పు.    

ఉహు లాభం లేదు..నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే

సరెలేవే జోకులాపి విషయమేంటో చెప్పవే

మధ్యాహ్నం ప్రోగ్రాం ఏమిటో అంటుంటే...కొద్దిగా ఇంటి పని చేసుకుంటూ ఆఫీస్ పని చేసుకోవాలి.

మా అన్న ఏం చేస్తున్నాడు.

సొల్లు కబుర్లతో టైం పాస్ చేస్తున్నాడు.

ఏమే నా ముందే మా అన్నను ఎన్నెన్ని మాటలంటున్నావే..ఉండు నీ పని చెపుతా!

సరే నీ ఇష్టం..నాకు చాల పని ఉంది. అంటూ ఫోన్ పెట్టింది.

నేను వెంటనే తయారై మానస వాళ్ళింటికి బయల్దేరి వెళ్ళాను.

వాళ్ళు లోపల గదిలో పని చేసుకుంటూ  ఉన్నారు..నేను సరాసరి హాల్ లో నుండి మేడ పైకి వెళ్ళాను. పైకి వెళ్లి మానస హస్బెండ్ మోహన్కు కాల్ చేశాను.

                                                

ఫోన్ ఎత్తి చెల్లి ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తుంటే..

చూస్తున్న..చూస్తున్న పెళ్ళాం ధ్యాసలో పడి నన్ను మర్చిపోయిన నిన్ను గమనిస్తున్నా..

ఎంత మాట చెల్లి..నువ్వు మా అమ్మవే..అమ్మనెవరైనా మర్చిపోతారా!

అబ్బో మాటలు బాగానే నేర్చావు..మానస బాగా ట్రైనింగ్ ఇచ్చింది…. అది సరే కానీ, పైన ఆకాశములో ఏదో తిరుగుతుందంట ఏంటది?

అవునా! నాకేం తెలియదే.

ఒకసారి పైకెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా!

సరే చెల్లెమ్మ అలానే చూస్తానంటూ ఫోన్ పెట్టేసాడు.


వెంటనే మానసకు ఫోన్ చేశాను..ఏమే పైన కనపడిందా అంటుంటే..ఏమోనే మీ అన్నయ్య కంప్యూటర్ లో సెర్చ్ చేస్తున్నాడు.

అన్నయ్యకు ఫోన్ ఇవ్వు..అంటుంటే ఫోన్ ఇచ్చింది.. అన్నయ్య నువ్వు పైన చూస్తావా! కంప్యూటర్ లో చూస్తావా అంటుంటే..ఇదుగో చెల్లి వెళ్తున్నాను అంటూ

మేడ పైకి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నాడు..పైన ఆకాశములో ఏం కనపడక.. పిచ్చోడిలా  అటు ఇటు దిక్కులు చూస్తూ.. ఏమి కనపడక బుర్ర గోక్కుంటూ వెనక్కి తిరిగిన మోహన్ కు నేను కనపడేసరికి ఒక్కసారి గట్టిగా కేకేశాడు. ఆ అరుపులకు మానస వస్తుందని గ్రహించిన మానసకు చెప్పొదంటూ నేను గోడ పక్కకు వెళ్లి దాక్కున్నాను.

                                                    

నేను ఊహించినట్లే అది పైకి వచ్చి మోహన్ భుజం మీద చేయి వేసి ఎందుకు అంతగా అరిచావంటూ.. ఏమైంది? కనపడిందా! ఎక్కడ? అంటూ పైకి చూస్తుంది.

నేను వెనుకగా వెళ్లి దాని రెండు కళ్ళు మూసాను. అది ఎంత ట్రై చేసిన నన్ను కనుక్కోలేక ఇబ్బంది పడ్తుంటే మోహన్ మరింత మరింత ఏడిపిస్తూ అల్లరి చేస్తున్నాడు.

                                                     

చివరికి నేనే తన కళ్ళ మీద నుండి చేతులు తీసేసాను..నన్ను చూసిన గట్టిగా హత్తుకుంటూ ఏమే అల్లరి ఇలా ఏడిపిస్తున్నావేందే అంటూ బుగ్గ మీద ముద్దు పెటింది.

Comments

Popular posts from this blog

Love Letter 30

Love Letter 29