Love Letter 30

 

                                                                                                        

                                                                        Written By Bhaanuchandara


నీ ధ్యాసలో సమస్త విశ్వం నేనే అనుకుంటూ..నేను అనే గర్వములో నన్ను నేనే మర్చిపోతూ అహంకారంతో విర్రవీగుతూ...తలెగరేసుకుంటూ తిరుగుతుంటానా! అంతలోనే నువ్వు నా పక్కన లేవన్న విషయం జ్ఞప్తికి వచ్చి అధఃపాతాళానికి కృంగిపోతాను.

మానసికముగా ఆశక్తురాలినై ఏదో తెలియని జబ్బు వచ్చినదానిలా నిస్సత్తువను కోరి తెచ్చుకుంటాను.

అరేయ్..మానసచోరుడా! మదనమోహనా!

                                                                         


ఇదివరకు రోడ్ మీద ఏది కనపడ్డ ఏది వదలకుండా ప్రతిదీ తినేవాళ్ళం..తినటం కోసమే బ్రతికినట్లుండేవాళ్ళం..ఇప్పుడు నేను బ్రతకటం కోసం మాత్రమే తింటున్నాను.
ఎంతో విశ్వాసంతో మాట్లాడే నేను బేలగా దైన్యాతిదైన్యముగా మాట్లాడుతున్నాను

పైపై మెరుగులు తప్ప ఇదివరకటి అందం లేదు. 


కృత్రిమ నవ్వు తప్ప ఇదివరకటి స్వ చ్చమైన సహజమైన నవ్వులు మాయమయ్యాయి.           

ఏదో నైరాశ్యం నన్ను నడిపిస్తుంటే ఎటు వెళ్తున్నానో తెలియని పరిస్థితి. 

ఏంతో గర్వము..పొగరుగా ఠీవిగా రాజహంసల ఉండే నా రూపురేఖలు మార్చేసావు. 

తెచ్చిపెట్టుకున్న డాంబికంతో అల అల బ్రతికేస్తున్నాను.


                                                           తప్పులుంటే మన్నించు..

తియ్యతియ్యని ముద్దుతో తప్పులు తుడిపేద్దాం  

గుబాళించే గుసగుసల సరిగమలో తెలియడుదాం  

కొప్పులోని ఘుమఘుమల మధురిమల స్వరాన్ని ఆలకించు

కన్నుల్లో దాగిన జలపాతాల వెన్నెల్లో జలకాలాడగా ఎద చేరు       


                                 నా పిచ్చి నేను నీకేమి తెలియదని ఏదేదో చెప్పేస్తున్నాను.              

నువేమో కవివి..నేనా అక్షర నిర్మాణమే తెలియని అధమురాలిని

పెదవుల్లో దాగిన అమృతపు రుచిని చవి చూపించిన మాంత్రికుడివి.  

శరీర తత్వాలు నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు..ఎక్కడ ఏది నొక్కితే ఎలా స్పందిస్తుందో..ఆ స్పందన తాలూకు ప్రతిచర్య ఏమిటో సైంటిస్ట్ కన్నా బాగా తెలుసు.

జీవితం ఒక్కటేనని..మల్లి మల్లి జన్మ ఉండదని తెలిసినా..ఎండమావుల వెంట పరిగెడుతూ నన్ను ప్రతి క్షణం..ప్రతి నిముషం చంపేస్తున్నావు.

చట్టానికి కూడా దొరకని హంతకుడివి..నీ కోసం..నీ గొప్ప కోసం అందరిని హింసిస్తూ చంపేస్తున్నా నర హంతకుడివి.         

నవ్వొస్తుంది...నవ్వుతు  నవ్వుతు ..అంతలోనే ఏడుపై..శోకిస్తూ..గుండెలవిసేలా 

దుఃఖిస్తున్నాను.

నువ్వు కోరుకున్నది దుఃఖమే అయితే దుఃఖితురాలినవుతా!

నా యీ దుఃఖాన్ని... నాలోని శోకాన్ని పుంఖానుపుంఖాలుగా లిఖించి నువో మహాకవివని అందరిచేత అభినందనలు అందుకుంటావా         

నీకు.. శవం మీద పేలాలేరుకునేవాడికి పెద్ద తేడా లేదు.

ఏడుస్తున్నావా...ఏడువు... గుండెలు పగిలేలా ఏడువు..నీకొచ్చిన అభినందన పత్రాలను కాల్చేస్తున్నావా!

కాల్చేస్తావో..నన్ను కూడా అందులో కలిపేస్తావో నీ ఇష్టం.

Comments

Popular posts from this blog

Love Letter 29

Love Letter 27