Love Letter 29

 

                                                                            Written by Bhaanuchandara


ఆలా నిశ్చింతగా నిద్రపోతున్న..నాలో..నీ ఆలోచనలు చుట్టుముట్టేయగా ఒక్కసారిగా  భయముతో ఉలిక్కిపడ్డాను. 

ఆ ఉలిక్కిపాటు నా మీద చేయేసినా... మానసకు  అంత నిద్రలోను స్పష్టముగా తెలిసిపోయింది.

ఏమైంది బేబీ!...బయపడ్డావు.? అంటూ..నా వీపును సవరిస్తూ...తను మంచం మీద నుండి లేచి అప్పటికప్పుడు నాకు దిష్టి తీసింది. 

                                                    


ఆ అలికిడికి మోహన్ కూడా లేచి విషయం తెలుసుకుని నాని గుర్తొచ్చాడేమో అంటూ వాడు వస్తాడులే కంగారుపడకంటూ నా తలని ప్రేమగా సవరించి తిరిగి తన ప్లేస్ లో  పడుకున్నాడు. 

నేను కొంచెం దూరముగా పడుకుంటే మానస దగ్గరకు హత్తుకుని కళ్ళు మూసుకుని పడుకోమంటూ చెప్తూ నిద్రలోకి జారుకుంది.

                                                    


నేను నీ గురించే ఆలోచిస్తూ..పక్కనే ఉన్న ఫోన్ అందుకుని అందులో నీ ఫోటోలు ఒక్కొక్కటి చూస్తున్నాను.

మనం గోవా వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలు ఉన్నాయి. 

గోవాలో ఈ బీచ్ వద్దు..ఆ బీచ్ వద్దు అంటూ ఎక్కడో లోపలికి ఉన్న ఆగొండ బీచ్ కి తీసుకెళ్ళావు. 

ఆ బీచ్లో చిన్న చిన్న అలలతో పలకరించే కెరటాలు తప్ప పెద్ద పెద్ద కెరటాల అలలు అసలే లేవు.

ఫారెనర్స్ తప్ప స్వదేశీయులు మనం తప్ప వేరెవరు లేరు...బీచ్ మాత్రం చాల బాగుంది.  

                                                            


    

అక్కడ ఆగొండ బీచ్ లో నేను పొట్టి..పొట్టి డ్రెస్ లు వేసుకుని నడవటానికి సిగ్గుపడుతుంటే నన్ను ఎత్తుకుని బీచ్ మొత్తం తిప్పావు ..అది చుసిన ఫారెనర్స్ ఒన్స్ మోర్ అంటూ  ఫోటోలు తీస్తూ నిన్ను మరింత ఎంకరేజ్ చేస్తుంటే బాడీ బిల్డర్ లా నన్ను అటు ఇటు అలవోకగా తిప్పేస్తుంటే.. అది చూసిన ఫారెన్ పిల్ల నన్ను కూడా ఎత్తుకోమంటూ చేయందిస్తుంటే నో నో అంటూ వాళ్ళ దగ్గరి నుండి దూరముగా వస్తుంటే..

                                                    


ఏం నేనున్నాని బయపడ్డవా? అంటుంటే...దేనికి? అంటూ ఏం తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తున్న నిన్నుచూస్తూ ఇదుగో ఇందుకు అంటూ నీ బుగ్గ కొరికేస్తే నొప్పి తట్టుకోలేక ఒసే రాక్షసి! అని పెద్దగా అరుస్తూ.. నన్ను కిందపడేసి కొట్టడానికి నాపై దాడి చేయబోతుంటే లేడీ పిల్లలా తప్పించుకుంటూ నిన్ను వెక్కిరిస్తూ...ఉడికిపోతూ నువ్వు.

కాసేపటికి యథాస్థితికి చేరిన మనిద్దరం.

                                                    

పొట్టి డ్రెస్లో నేను మరింత అందముగా ఉన్నానంటూ...నా ఫోటోలు తీయబోతుంటే సిగ్గుతో కుచించుకపోతున్న నన్ను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెడుతూ నేను అమ్మాయిని అనుకోమంటూ నా దగ్గరున్న చున్నీ తీసుకుని అమ్మాయిల అభినయిస్తూ..నేను నవ్వుతు సిగ్గులొలకబోస్తుంటే...ఎన్నెన్ని ఫొటోస్ తీసావో...మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు..అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ అంటూ పాట పాడుతూ విరాహములో దహిస్తూ...అల్లరల్లరి చేసిన నిన్ను తలచుకుంటుంటే ఒంట్లో వేడి జెనరేట్ అవుతుంది. 

                                                    

ఫొటోస్ చూసినప్పుడల్లా నేనేనా అనే డౌట్ వస్తుంది..సినిమా హీరోయిన్లా ఎంత సెక్సీ గా ఉన్నానో..? 

ఇప్పుడెలా ఉన్నానో తెలుసా! 

నేనిప్పుడు ముద్దపప్పులా...మొద్దు పిల్లలా పిచ్చిగా ఉన్నాను.

                                                          


మందారపు సిగ్గులో నుదిటిన సిందూరమై 

సిందూరములో నువ్వు ప్రకాశించాలని

ఆది మనిద్దరి జీవితాల్లో వెలుగవ్వాలని

వేవేల దేవుళ్లను ప్రార్థిస్తూ శుభరాత్రి చెప్తూ.. 

నీకు స్వాగత తోరణాలు కట్టి ఉంచాను...వస్తావని మోమున మల్లెలు పూయిస్తావని...



Comments

Popular posts from this blog

Love Letter 30

Love Letter 27