Love Letter 28


                                                                    Written By Bhaanuchandara 


నేను పసిపిల్లల మారం చేస్తుంటే.. నన్ను సముదాయిస్తూ మోహన్..మానస.

నేను రాక రాక వచ్చానని తన పనులన్నిటినీ పక్కనపెట్టి...మానస అప్పటికప్పుడు పకోడీలు చేసి పెట్టింది. 

ఇంకా మోహన్ అయితే తన ప్రోగ్రామ్స్ అన్ని కేన్సెల్ చేసుకుని, నా పక్కనే కూచుని అమ్మీ..అమ్మీ అంటూ నేనేదో దేవలోకం నుండి వచ్చినట్లు ఎన్నో విషయాలను హాస్యపూరితముగా వివరిస్తూ నను నవ్విస్తూ...మధ్య..మధ్యలో కాఫీలు టీల.తో అలరిస్తూ మానస.

                                                    

సమయం తెలియలేదు...రాత్రి పదకొండైంది.

మానస ఎప్పుడు ప్రిపేర్ చేసిందో కానీ అన్నం..పప్పు..చారు..ఆలు ప్రై..వంకాయ ప్రై..పెరుగు నా కోసం చేసింది..నేను ఆశ్చర్యపోతూ చూస్తుంటే..మేడపైకి వెళ్లి తిందామంటూ మేడ పైకి వాటినన్నిటిని తీసుకెళ్లింది. 

నేను మోహన్ ఇద్దరం కూడా మేడపైకి చేరుకున్నాం. 

మొదటగా ప్లేటులో కొత్తగా పెట్టిన ఆవకాయ్ పచ్చడి ..అన్నం కలిపి నాకు మోహన్ కు గోరు  ముద్దలు పెట్టింది.

                                            



ఆ ఒక్క ముద్ద నాలుకపై చేరి లాలాజలపు ఊటను స్రవిస్తుంటే..ఎన్నెనో రుచుల గ్రంధుల మొలకల్లో... నాలుక ఆగలేక..యావని మోముపై పండిస్తుంటే.. అది కాంచిన మానస గోరుముద్దలు కొసరి..కొసరి ఇద్దరికీ తినిపిస్తుంటే...పసందైన భోజనాన్ని ఆహా..ఓహో అంటూ మెచ్చుకుంటూ ఆమె చేతి ముద్ద నాకంటే...నాకనుకుంటు పోటీలు పడి మరి  తిన్నాం.

                                                            


 

మేమిద్దరం తిన్న తరువాత మానస కూడా అదే ప్లేట్లో పెట్టుకుని తిన్నది.

ఈ లోపు మోహన్ కిందకెళ్ళి స్వీట్ పాన్ పట్టుకొచ్చాడు.

పాన్ తిన్న తరువాత ముగ్గురం పడుకోటానికి కిందకెళ్ళాం.                                                           

మోహన్ హాల్ లో పడుకుంటే..నేను మానస మంచముపై పడుకున్నాం.

మానస బొజ్జపై చేతులు వేసి...మూడంకె వేసి పడుకున్న నన్ను దగ్గరకు తీసుకుంటూ..అమ్మలా జో కొడుతూ తను.

                                                        


మానస బుగ్గపై ముద్దుపెట్టుకుని ..మరింత ముడుచుకుపోయిన నేను. నన్ను మరింత దగ్గరకు తీసుకుంటూ తను.    

ఏ జన్మ బంధమో..ఈ అనుబంధమనుకుంటు నిశ్చింతగా నిద్రపోయాను. 



Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6