Love Letter 32

 

                                                                                 Written By Bhaanuchandara

అందరూ గాఢనిద్రలో..నేనేమో నీ ఆలోచనల కడలిలో ఈదుతూ..నిన్నాక్రమించేయాలనే అత్యాశను ఆణువణువూ నింపుకున్న నేను..నీ దరికి వస్తుంటే...నువేమో నీడవై నా నుండి దూరముగా జరుగుతూ..ఇదుగో నేనిక్కడ అంటూ వగలొలికిస్తావు.    

          

       నీ కులుకులు నిజముగా భ్రమించి తుమ్మెదలా ఝంకారం చేసుకుంటూ..లలిత మనోహరమైన నవయౌవన సౌందర్యం కోసం...చిరంజీవిని చేసే అమృతం కోసం అలసట లేకుండా ఆలా తిరుగుతూనే ఉంటాను.

అచ్చోట..ఇచ్చోట..ఎచ్చోటయినా ప్రేమ నిండిన జగతి కోసం...అన్వేషిస్తూ ఆ'రాధ'నై ఉన్నాను.

      
                                                          

అలా తిరిగి..తిరిగి విసిగి వేసారిన నేను పగలబడి నవ్వుతాను...నవ్వుతు నవ్వుతు పూలల్లో దాగిన మృదుమధురమైన తియ్యదనాన్ని అనుభవిస్తూ నన్ను నేను మరిచిపోతాను.

సప్తవర్ణాల సముద్భవములో... నే..ఆలాపనై ప్రక్రుతి ప్రేమను వర్షించాలనే నా తాపత్రయాన్ని ఎగతాళి చేస్తూ...

                                  

మురళి మనోహరుడు నా వంక చూసి నవ్వుతు..వెదురు గొట్టాన్ని ఇచ్చాడు..ఏం చేయాలో అర్థం కాకా దాని వంకే చూస్తుంటే...అదేమో తియ్యగా నవ్వుతూ..నా గుండెని కత్తి లేకుండా మెత్తగా..తన గాన మాధుర్యముతో మత్తెక్కిస్తూ మెత్తగా కోసింది. 

       బాధలో... మత్తుగా సోలిపోతూ నీ ఒడిని బిక్షగా అడిగాను...కనికరం లేని చూపులతో గాయపడిన               మనసును..మరింతగా కోసేస్తూ నవ్వుతుంటావు.   

    


నీ వైపు చూడలేక భూమాత ఒడిలో చేరి దుఃఖాన్ని పంచుకుంటూ..నన్ను నేను అనునయించుకుంటాను. 


Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6