Love Letter 33

 

                                                                            Written By Bhanuchandara


తెల్లవార్లూ కన్నీటితో దుప్పటిని దిండుని అభిషేకించిన నేను..ఉషోదయపు వేళలో చిరునవ్వుల కోటింగ్ మొహానికి పులుముకుని ఎన్నెన్నో వన్నెచిన్నెలతో నాజూగ్గా మెరిసిపోతుంటాను.


ఎందుకంటె నాది మీడియా ఫీల్డ్..లోపల ఎన్ని వున్నా నేను నవ్వుతూనే ఉండాలని...చూసేవాళ్లకు ప్లెజంట్గా కనిపించాలని..అసలే నేను  చిన్నప్పటినుండి స్టైల్ గా తయారవటంవల్ల ఇప్పుడది నాకు మరింత కామన్ అయింది.

అలానే ఆఫీస్ కు వచ్చాను. నేను ఆఫీస్ కు వెళ్లేసరికి మాధురి ఫ్రంట్ ఆఫీస్లో వెయిట్ చేస్తుంది.  


శైలూ.....ఐ లవ్ యు అంటూ నా...బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ నేనే మగాడినైతే నిన్నెప్పుడో  లేపుకెళ్లి పెళ్లి చేసుకునేదాన్ని.   

అంటుంటే తననేమి అనలేక ఓ నవ్వు నవ్వుతుంటే అబ్బా....! ఎంత మత్తుగా ఉన్నావే అంటూ గట్టిగా నన్ను హాగ్ చేసుకుంటుంటే ఇబ్బందిగా నేను...నా ఇబ్బందిని పట్టించుకోకుండా తన్మయత్వములో తను. 

నీ గురించిన ఆలోచనలతో నిట్టూరుస్తూ నేను.......

  

ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరుతుంటే ప్రీతి ఫోన్ చేసింది...ఎక్కడున్నావంటూ? ఇదుగో ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరుతున్నాను. అంటుంటే...

సరే మా ఇంటికి రా....భాస్కర్ గాడు కూడా ఇక్కడే ఉన్నాడు..వాడు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు...అని చెప్తుంటే సరేనంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

నేను వెళ్లేసరికి టేబుల్ మీద మందు బాటిల్స్ రెడీగా ఉన్నాయి..ఏమిటి విసయమంటుంటే...ఏమి లేదు భాస్కర్ గాడు మందు తాగుదామంటూ గొడవ చేస్తుంటే...సరేనన్నాను.

అంటూ నాక్కూడా మందు పోస్తుంటే సారీనే...మందు తాగితే నాకు వాడు గుర్తొస్తాడు.. ఏడుపు వస్తుంది..మీ మూడ్ ను స్పాయిల్ చేస్తాను అంటూ స్మూత్ గా తిరస్కరిస్తుంటే..

                       సరెలేవే ఒకే ఒక పెగ్గు తీసుకో...అంతకన్నా ఎక్కువ వద్దు..అంటూ స్కాచ్ ఓ పెగ్గు  పోసింది..ఆలా ఒక్కటన్నా పెగ్గు...నను మత్తులో పడేసి..కన్నీటి సముద్రములో ముంచేసింది..

ఆ కన్నీరు గుండెలో చేరి లావాలా నను దహించేస్తుంటే...నేను జ్వాలనై మండిపోతూ...అంతలోనే కన్నీరుగా కరిగిపోతూ..చిత్రవిచిత్రముగా నను హింసిస్తుంటే... 


వేదనను భరించలేని నేను...రోదననై దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాను.

Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6