Love Letter 34

 

                                                        

                                                                                Written By Bhaanuchandara


హే బేబీ...!

ఏమిటి బేబీ అంటున్నానని గింజుకుంటున్నావా! 

బేబీ..బేబీ..బేబీ వందసార్లు ..కాదు కాదు లక్ష సార్లు అంటాను... నేను కాకపోతే నిను ఇంకెవరు అంటారు..అంటే ఊరుకుంటానా!

ఓరేయ్ నా చిట్టి బేబీ....నువ్వలా చిన్నపిల్లాడిలా నన్నేమి అనలేక  కాళ్ళు టపటపాలాడిస్తుంటే నీతో మరింత ఆటలాడిలన్పిస్తుంది...అదే సమయాన నిను నా గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది.

పదే పదే అల్లరి పెడ్తున్న...నన్నేమి అనలేక...కోపముతో వేడి వేడి కాఫీ ఒకేసారి తాగి నాలుక కాల్చుకున్న ఆనాటి వైనమింకా గుర్తుందిలే... 

అదే పనిగా టీజింగ్ చేస్తుంటే..నన్నేమి చేయలేక గోడకేసి నను గట్టిగా అదిమి.. ఉఛ్వాసా నిశ్వాసలా  ఊపిరిలో శరీరం బరువుగా మారిపోతుంటే బుసలు కొట్టే శ్వాస మరింత ఉద్రేకపరుస్తుంటే... ప్లీజ్ ప్లీజ్ అంటూ నేనిన్ను అభ్యర్థిస్తుంటే...క్షణములో తెలివి తెచ్చుకుని తలవంచుకు దూరముగా వెళ్లిన నీ నిజాయితీ ఇప్పటికి గుర్తుందిలే.

      
నేనల్లరిగా .కళ్ళతో నిను కవ్విస్తుంటే..నువేమో నా వైపు దొంగ చూపులు చూస్తూ అంతలోనే  సిగ్గులో దూరిపోయే నిన్ను చుస్తే బలే బలే ముచ్చటేస్తుంది.

నిజం చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది...నా సిగ్గులన్ని నీ హృదయ వక్షస్థలములో దాచేయాలనిపిస్తుంది.

వెంటనే. నాలోని సిగ్గులను గిల్లేసి మధురమైన చిరు ముద్దుల హారంతో నిన్నలంకరించి చుట్టేయాలనిపిస్తుంది.      

ఏమి చేయాలో తోచక బిక్క మొహం వేసుకుని సిగ్గుపడుతున్నా నీ సిగ్గులని కూడా  ఒక్కోక్కిటిగా వలుస్తూ నిను నా  గుండెలో దాస్తూ...నీ గుండెలో నే...గువ్వపిట్టల ఒదిగి పోవాలనిపిస్తుంది.  

ఇన్ని చెపుతున్నానా.....!

నువ్వు గుర్తొస్తే చాలు..సిగ్గుల  మొగ్గలా మారిపోతాను...పదే పదే  నీ మాటలు తలచుకుని మెలికలు తిరుగుతూ పరవశమై పోతుంటాను.   


నే దారిన నడుస్తుంటే ...ఎవరినో చూసి నువ్వని తలుస్తూ ...పెదవులన్ని అరవిరిసిన మందారపూలై విచ్చుకుంటుంటే....ఆ మురిపెములో నేనో మల్లెపూవై పరిమళిస్తాను...ఆ పరిమళం చుట్టూరా వ్యాపిస్తుంటే..ఆ పరిమళం తనకోసమేనని దారిన పోయే దానయ్యలంతా నా చుట్టూ రౌండ్ వేస్తుంటే...వాస్తవాన్ని గ్రహించిన నేను ఎవరిని  ఏమి అనలేక...నా మనఃస్థితిని చెప్పలేక అప్పటికప్పుడు ఫోన్ కు పని చెపుతూ వేగముగా అక్కడినుండి బయటకు వస్తాను.


సిగ్గేస్తోందా - సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నది

బుగ్గమీద చిటికేస్తే హోయ్ సిగ్గేస్తోందా - సిగ్గేస్తోందా?  పాటలో లీనమయ్యావా...

నీ నీలి నీలి కన్నుల్లో దాగిన నా రూపం..నీ హృదయములో చేరి మతి పోగొడ్తుందా....! 

లేక మత్తెక్కిస్తుందా.......!

                              జాగ్రత్త రోయ్...హాగ్ అంటూ పేచీలు పెడతావేమో అవేవి కుదరవు. 

Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6