Love Letter 37

 

                                    

                                                                             Written By BhaanuChandara              

                       కృష్ణశాస్త్రిగారి కవితల 

                "ఇక నాకు ఉగాదులు లేవు.. ఉషస్సులులేవు

              నేను హేమంత కృష్ణానంత శర్వరిని

               నాకు కాలం ఒక్కటే కారు రూపు

          నా శోకమ్ము వలెనే ..నా బ్రతుకు వలె.. నా వలెనె"

నాకు పండుగలు..పబ్బాలు లేకపోయినా నేను మాత్రం పచ్చని పైరునై...సస్యశ్యామలమై.. చిరునవ్వుల పంటనై..అందరి యెదలో ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.

ఎస్...నీ సన్నిధిలో నే పులకరించాను...పరవశించాను..ప్రేమగా మారాను...సోకమై మిగిలిపోయాను. 


                                         నేను ప్రేమంటే సప్తవర్ణాల శోభ అనుకున్నాను.

ప్రేమంటే యుగాది పచ్చడిలా షడ్రుచుల మధురమనుకున్నాను   

నాకు జీవితములో.. ఏ రుచులు లేవు ...ఏ వర్ణం తెలియదు...నాకు తెలిసిన రుచి..చేదు...నాకు తెలిసిన వర్ణం కాటుక రంగు.


  

నేను వెళ్లే దారిని నల్లగా (అంధకారంగా) మార్చేస్తే ఎటు వెళ్లాలో తెలియక అక్కడే చతికిలపడ్డాను.

ఈ గాఢాంధకారంలో  దారి తెలియక...ముందుకు వెళ్లాలో..వెనక్కి వెళ్లాలో..పక్కకి వెళ్లాలో అర్థం కాక సతమతమవుతూ..నీ కోసం నేను.

ప్రియా.....నీ కరుణ కటాక్ష వీక్షణాలకై ..అదిరే కళ్ళను..బెదిరే మదిని స్వాంతనపర్చుకుంటూ ...నేనే రాయిలా మారి అహల్యనై ఉన్నాను.


అదేమిటో...నేను రాయిగా మారిన కూడా నాలోని కన్నీటి సముద్రం ఉటగా మారి ఉబికి ఉబికి వస్తుంది...నన్ను నదిగా మార్చింది.

బహుశా ఈ చెరువులు..సరస్సులు...వాగులు... నదులు...అన్ని...ప్రతిదీ శోకముతో ప్రవహించే అతివ తాలూకు కన్నీటి బొట్లే సుమా!


నన్ను మర్చిపోయిన నిన్ను ఇదే నీటితో..కన్నీటి బాధతో నా తల్లి పుడమిని ఆలింగనం చేసుకుంటూ లోలోని బాధను పంచుకుంటూ.. నాలోని దుఃఖాన్ని తీర్చుకుంటూ నాకు గుర్తుగా పచ్చని పైరునై ...చిరునవ్వులు చిందిస్తూ...నీలోని ప్రాణానికి  జీవాన్నై..చైత్యానాన్నై..నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రాణేశ్వరిని.         


                           నీకు ప్రేరణగా నాలోని ఆణువణువూ ప్రకృతిగా రూపాంతరం చెందుతూ...

నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

నీకు దారి చూపుతూ...నీ బాధను పంచుకుంటూ...నీ వ్యధను తీర్చేస్తూ....నిన్ను లాలిస్తూ..సోదరిలా..స్నేహితుడిగా... ప్రేయసిలా...భార్యలా...అమ్మలా నీ వెంటే ఉంటాను..నీకు తోడై నిలుస్తాను...నీకు నీడలా నీ వెంటే ఉంటాను...

నిన్ను ప్రేమిస్తుంటాను.

Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6