Love Letter 38

     

                                                                                       Written By Bhaanuchandara                                                                                      


చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అంటూ నిన్నాహ్వానిస్తూ నేను.


నువ్వు వస్తావని ...పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతావని..ఆశగా అలానే వేచివున్నా ..క్షణాలు లెక్కపెట్టుకుంటూ..కళ్ళల్లో వత్తులు పెట్టుకుని నిరీక్షిస్తున్నా...

కంటినుండి ముత్యపు బిందువులు జల జల రాలుతున్నా..గుప్పెడు గుండె వేదనతో చితికి చితికి పోతున్నా నీ కోసం కొనఊపిరితో ..నాపై ఇసుమంతైనా దయ లేదాయె....

ప్రేమంటే..."మంటే" కాల్చేస్తూ కనపడకుండా చేస్తుంది.

ప్రేమంటే..."దుఃఖమై" ముంచేస్తూ తడిగుడ్డతో ప్రాణాలు తీస్తుంది.

ఏ జన్మలో ఏ పాపం చేశానో...ఈ జన్మలో నన్నిలా ప్రేమ రూపాన కాటేసిందో..శాపించిందో?  

పరిహారమేంటో..పరిష్కరమేంటో అర్థం కాకా అపరిష్కృతనై ఉన్నాను.  


 ఈ శాపాన్ని..నాలోని పాపాన్ని ఎలా..ఎలా నివృత్తి చేసుకోవాలో అర్థం కాకా అయోమయాన్నై వెన్నెల్లో శిల్పాన్నై కనపడకుండా జాబిల్లి నీడలో ఒదిగిపోయాను.  

ప్రేమకు ఏమిస్తే స్వయంవరం కలుగుతుందో? అర్థం కానీ "?" అయింది.


నే కాలిపోయిన..నే..రాలిపోయిన దూళిలో కలిసిపోయిన నీ పాదస్పర్శ తగలగానే నేను మల్లి చిగురిస్తాను. 

చిరునవ్వులు చిందిస్తూ కొయిలగా మారి క్రొంగొత్త రాగాన్నై..నీ గుండెను కొల్లగొడతాను.

నువ్వు  తియ్యని భాద అనుభవిస్తుంటే...నేన్నిన్ను నా పాటతో లాలిస్తుంటాను. 


లాలిస్తూ...లాలిస్తూ ఎదపై ఎత్తుకుని... జోకొడుతూ..జాబిల్లిని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తాను.   

నువ్వు పవళించినప్పుడు లేలేత తెమ్మరనై.. సుమగంధాల సుగంధాలను నీ మేనుపై పూస్తాను. 


ప్రేమకు ఇవ్వటం మినహా తీసుకోవటం తెలియదు..

ప్రేమంటే మంటే కానీ ప్రేమ ప్రేమే  

ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మనం మాత్రం ప్రేమ పేరుతొ...కాలాన్ని తిట్టుకుంటూ మనం ఉన్న చోట ఆగిపోయాం. మీ చావు మీరు చావండంటూ  కాలం తాపీగా నడుస్తుంది.

 

ఇంకా ఇక్కడే ఉందామా...! కాలంతో పాటు నడుద్దామా!

రేయ్ మరి చించకు...జీవితం చాల చిన్నది.


Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6