Love Letter 41
Written By Bhaanuchandara
చంద్రకళ వాళ్ళింట్లో ఫంక్షన్ ఉందని పిలిచింది...పిలవటం వరకు బాగానే ఉంది కండిషన్ అప్లై చేసింది..లైట్ పింక్ కలర్ చిరకట్టుకు రమ్మంటు ఆర్డర్ పాస్ చేసింది.
అల అని రాకుండా ఉంటె చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.
అదేమని అడిగితె ఈ ఫంక్షన్ కు పింక్ కలర్ సారీస్ డ్రెస్ కోడ్ పెట్టాను అంటూ చెప్పింది
నిజానికి వెళ్లే మూడ్ లేదు.
అది చూడగానే నువ్వు గుర్తొచ్చావు. మనం మైసూర్ వెళ్ళినప్పుడు..చేతిలో చాలినంత డబ్బులు లేకపోయినా నేను వద్దు వద్దు అంటున్న వినకుండా అప్పటికప్పుడు అప్పు చేసి కొన్నావు. ఇప్పుడిది అవసరమా! అంటుంటే..
అవసరం కాకపోవచ్చు..కానీ మనం పదే పదే మైసూర్ రాకపోవచ్చు. కొందామనుకున్నప్పుడు ఇలాంటి కలర్ దొరకకపోవచ్చు.
ఏ మాటకామాటే చెప్పాలి నీ సెలక్షన్ అద్భుతం.
ఎప్పుడు చీర కట్టిన లేడీస్ అయిన జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు నన్ను అప్సరస అంటూ ఆకాశానికెత్తేస్తుంటారు.
అందులో ఈ చీర మరి ప్రత్యేకంగా నన్ను పది మందిలో ఒకరిగా పరిచయం చేస్తుంది
అందుకే చీరలు కట్టడమే మానేశాను.
ఇప్పుడు చంద్రకళ బలవంతం మీద ఈ చీర కట్టుకుంటున్నాను.
ఇబ్బందిగా నేను...నువ్వు పక్కనుంటే ఎంత బాగుండేది.
ప్చ్...
అందులో ఓ లేడీ నా దగ్గరకు వచ్చి ఓ సారి..ఈ శారీ యియ్యవా! కొన్ని ఫొటోస్ తీసుకుని ఇస్తాను అంటుంటే నేను ఓ నవ్వు నవ్వాను.
చంద్రకళ నా దగ్గరకు వచ్చి దేవత
ఫంక్షన్ అయిపోయాక చంద్రకళ నన్ను లోపలికి తీసుకెళ్లి దిష్టి తీసింది...నేను నవ్వుతుంటే ఏ కళ్ళు ఎలాంటివో తెలియదు కదే...అందుకే అంటూ...నన్ను అమ్మలా దగ్గరకు తీసుకుంది.
నాకు అర్థం కానీ విషయం ప్రతి ఒక్కరు నన్ను ఎంతో అపురూపముగా..ఆప్యాయముగా చూసుకుంటారు.
మరి నువెందుకిలా! నాతొ మౌనాన్ని ప్రదర్శిస్తూ...మూతి ముక్కు బిగించేసుకున్నావు.
ఒక్కసారి ఓపెన్ అయితే అన్ని సర్దుకుంటాయి.
మరేమంటావు..మాట్లాడితే పోయేదేముంది..మహా ఐతే అపోహలు తప్ప.
Comments
Post a Comment