Love Letter 42
Written By Bhaanuchandara
పున్నమి జాబిలిని చూసిన సముద్రుడు ..పొంగే సంతోషాన్ని దాచుకోలేక..లోలోన ఉప్పొంగుతూ...అటు ఇటు పరిగెడుతూ..తనలోని ఆరాటాన్ని లోపల దాచుకోలేక..బయట పూర్తిగా వ్యక్తపరచలేక...అతలాకుతమవుతూ...తనలో తానూ మధనపడుతూ...రసావేశముతో ఉప్పెనై...హొయలు పోయే వెన్నెల వన్నెలను చూసి తట్టుకోలేక ఉన్నపలంగా జాబిలిని తనలో దాచుకోవాలని ఎగేసెగిసి పడుతూ..
దరి చేరమంటూ అందరి ముందు తనని దీనంగా ప్రాధేయపడుతూ...శతసహస్ర విధాలుగా వేడుకుంటూ...బ్రతిమాలుతూన్నా సముద్రుడ్ని కాంచిన జాబిలి మరింత సిగ్గుతో కందిపోతూ లేలేత పసుపచ్చని వస్త్రాన్నిసముద్రుడిపై కప్పి సరసమాడుతూ సాగరంలో కలిసిపోయింది.
సముద్రుడ్ని చూస్తే జాబిలికి పరవశం...జాబిలిని చూస్తే సముద్రుడికి మహదానందం.
కానీ ఒక రోజు... సముద్రుడు చేసే అల్లరి..చిలిపితనం భరించలేక మబ్బులమాటున ఉండిపోయింది.
సముద్రుడు జాబిలి కానరాక దిగాలుగా ఎప్పుడొస్తుందా! అని ఆకాశం వంకే చూస్తూ కన్నీళ్ల పర్యంతమవుతూ...విరహగీతాలాపన చేస్తుంటే ...మబ్బుల చాటున దాగిన జాబిలి వెంటనే ప్రత్యక్షమై చిరునవ్వులు చిందించింది. అది కాంచిన సముద్రుడు చిన్నపిల్లాడిలా ఆనందముతో చిందులు వేస్తుంటే వెన్నెల మరింత వేడెక్కింది.
అదే జాబిలి..అదే వెన్నెల.
ఎప్పుడు చూసే జాబీలే..కానీ జాబిలిని చూడగానే సముద్రుడు పులకిస్తూ స్వాగతం పలుకుతాడు.అలానే జాబిలి కూడా అదే సముద్రుడ్ని చూడగానే సిగ్గుతో మరింత మై మరిచిపోతూ కలువపూవుల వికసిస్తుంది.
ఈ విషయమంతా నువ్వే నాకు చెప్పావు.
ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే నువ్వు లేక నేను..నేను లేక నువ్వు మనిద్దరి గూర్చి ఆలోచిస్తూ మన ఫామిలీ మెంబెర్స్...మొత్తంగా నిరస రసాన్ని సేవిస్తూ...
జగమే మాయ బ్రతుకే మాయ అనుకుంటూ...పాడుకుంటూ
అల్లరి పిల్లోడా!.. ఏమిటి నవ్వుతున్నావు?
ఎక్కువ నవ్వావంటే..నెత్తిమీద మొట్టికాయలేస్తా!
పిల్లాడికి బొత్తిగా భయం లేకుండా పోయింది.
అన్నట్లు... లతకు బాబు పుట్టాడు..పెళ్లంటే ఇష్టంలేని వాళ్ళు పిల్లల్ని ఎలా కంటున్నారో అర్థం కాలేదు..అదే విషయం లత హస్బెండ్ రాకేష్ను.. లతను అడిగాను.
అవును..మీకు పెళ్లంటేనే ఇష్టం లేదన్నారు..మరి బాబు అంటే ఇష్టమేనా? అంటే మీసం మెలేస్తూ ఐ ఫీల్ ప్రౌడ్లీ అంటూ బాబును ముద్దు పెట్టుకుంటూ గర్వంగా చెప్తుంటే...ఓ పక్క లత ముసిముసిగా నవ్వుతుంది.
వాళ్ల కళ్ళలో మెరుపులు... నాలో కన్ఫ్యూషన్?..ఇష్టం లేకుండా కూడా పిల్లల్ని కనొచ్చా! అని ఆలోచిస్తూ..
అదేరా! స్పందన..లబ్ డబ్ ఏవి అక్కరలేదా!
కొరికే మనిసిని..మనసుల్ని కలిపేస్తుందా!
జంతువులకు మనకు తేడా లేదా!
ఏమిటో అర్థం కానీ ప్రశ్న.
నువ్వు ఆలోచిస్తున్నావా!
Comments
Post a Comment