Love Letter 43

 


                                                                                        Written By Bhaanuchandara


లవ్ యు లవ్ యు మై డియర్.  ఐ లవ్ యు 

"ప్చ్"

ఎంత స్వీటో 

సిగ్గా.....కొత్తగా ఏమిటిది...ఓహో నేను లవ్ యు అన్నందుకా!

ఆస్వాదించు బే...నకరాలు చేయకు.     

లవ్ యు అంటేనే మెలికెలు తిరిగే నువ్వు

                        మల్లెల దరహాసాల లాంటి పరిమళించే ముద్దిస్తే తట్టుకోలేవేమో! 

అబ్బో..నీ సిగ్గును కాకులెత్తకెల్లా...ఎందుకైనా మంచిది "...."  కొంచెం దాచుకో! 

అందరు చూస్తున్నారు. మరి బాగోదు.     

అప్పుడెప్పుడో నా కట్టు..బొట్టును నా నవ్వును చూపును... నా మాటను నడకను...నన్ను  ,,,నాలోని ప్రతి కదలికను..ఆణువణువూ  ప్రేమించి అల..అల ఆకాశమంత ఎత్తుకు చేర్చి.. 


ఇప్పుడేమో నువ్వు కనపడకపొతే నేనేం చేయను?     

ఆశ్చర్యార్ధకమైన మొముతో కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని అంతగా చూడకు...నాకు " సిగ్గు" వేస్తుంది.

నేను ఆడపిల్లను...నాలోని సౌందర్యం కన్నుల్లో  ఒలికినప్పుడల్లా..  నిను మించిన సిగ్గుతో అద్దానికే చిరాకుపెట్టించిన అందాన్ని.


నెలవంకలాంటి నా పెదాలను..నిండు జాబిలిలా మార్చి ..నీకో మధురాతిమధురమైన తియ్యని స్వీట్ ను పంపిస్తున్నాను.

నింపాదిగా ఆరగించి....ఎలా ఉందొ చెప్పు.

అద్భుతంగా ఉందా! 

ఎందుకుండదు..పంపింది శైలు కదా!

శైలు ఏం చేసిన..అందమే. 

ఈ సదానందములో సిగ్గు లజ్జ మానం అభిమానం అన్ని వదిలేసి నువ్వే నా లోకమన్నాను. నువేమో నా లోకం వేరంటూ మొహం చాటేస్తున్నావు.

అవునోరెయ్ నాకో చిన్న అనుమానం...తీరుస్తావో...లేదో

పెళ్ళైపోయాక అబ్బాయిలను పట్టుకుని బకరా అంటారు కదా! 

ఒక్కరు కూడా అమ్మయిలను బకరా అన్నట్లు నేను చూడలేదు..నేను వినలేదు. ఎందుకంటావు? అబ్బాయిలు అంత అ"మాయకులా"! లేక అమ్మాయిలు గడసరి వారా!

నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు.

                                    ఎవరెవరికి బకరానో...?                                     

అగైన్ ఐ లవ్ యు.


మరి అంతగా మొఖం తిప్పుకోకు. నేనేం చేసిన భరించాల్సిందే.

నేను తిట్టినా..కొట్టిన  ఉమ్మేసిన..ముద్దేసిన పొగిడిన..పాతరేసినా అన్నిటిని అన్నిటిని చిరునవ్వుతో మోయాల్సిందే. 

భరిస్తూ.. జీవితాంతం నాకు ప్రేమను పంచాల్సిందే..నువ్వు అలిసినప్పుడు నా నుండి ఏం కోరుకుంటావో అంతకు మించి నాకు పంచాల్సిందే. 


నే  అలిగిన..కోప్పడిన నువ్వు నన్ను ముద్దు చేయాల్సిందే...ఆ ముద్దులో నేను ముత్యమై మెరిసిపోవాలంతే...అంతే అంతకు మించి కొంచెం తేడా వచ్చిన ఆడ సింహాన్నై గాండ్రిస్తా. జాగ్రత్త.

కాదు..కూడదని వెనుకడుగేసావో జడతో నిను కట్టేస్తా...ప్రేమగా బందించేస్తా!

ఎస్...నువ్వు నన్ను భర్తగా భరిస్తూ..ప్రియుడిలా ప్రేమిస్తూ..సోదరుడిలా తోడుగా ఉంటూ...పుత్రుడిలా మమకారమందిస్తూ...తండ్రిలా లాలిస్తూ నను పాలించాలి.


అందుకే అబ్బాయిలు బకరా అంటావా!  

ఒకే ఒక్క మాటతో అమ్మాయిలను  ఐస్ చేస్తూ బకరా చేసేది మీరు.  

సరేలే... నేనేం చేసిన నాలుగోడల మధ్యనే...బయటకు వచ్చినప్పుడు నీకు చిత్తమంటూ..నీ మాటను శిరసావహిస్తాను...నీ రాజసానికి భంగం కలుగకుండా చూసుకుంటాను.                 (ఈ విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటాను) 


మే.....మే....మే       

నవ్వకు...నవ్వితే కోపమొచ్చేస్తుంది....వస్తే రానీయమంటావా...

ఒరేయ్ వస్తున్నా కాళికనై..కాచుకో           

పారిపోకు.   

Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6