Love Letter 44

 

                                                                                       Written By Bhaanuchandara


నేను ఒక్కదాన్నే మేడపై వెల్లకిల పడుకుని ఆకాశములో నక్షత్రాలను లెక్కబెడుతున్నాను.

ఎంతకీ లెక్క కుదరటం లేదు...అయిన మల్లి మల్లి ప్రయత్నిస్తున్నాను. 

ఉహు మల్లి మొదటికే లెక్క వచ్చింది. 

 అది వెన్నెల రేయి..నన్ను చూసి శరత్చంద్రుడు కొంటెగా నవ్వుతున్నాడు. ఆ కొంటెతనాన్ని భరించలేక ఉడుకుమోత్తనంతో పదే పదే ప్రయత్నిస్తూ లెక్కించలేక ఓడిపోతున్నాను. 

నాలోని సహనానికి మరింత మెరుగులు దిద్దుతూ...పట్టు వదలని విక్రమార్కుడిలా బేతాళుడి        (నీ ప్రేమ) అన్వేషణలో... 


ఇంతలో అమ్మ వచ్చింది. ఏం చేస్తున్నావంటూ ప్రశ్నిస్తుంటే..నేను మాట్లాడకపోయేసరికి నా పక్కన తను పడుకుంది. నా చేతుల్ని తన చేతిలో పట్టుకుని నా బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఆ స్పర్శతో అప్పటివరకు ఎక్కడున్నాయో తెలియని నీరు కన్నుల నుండి స్రవిస్తూ చంపలపై చేరి నను తడిపేస్తుంటే..అది గమనించిన అమ్మ "పిచ్చి" అంటూ నన్ను గుండెలకు హత్తుకుంది. 

ఏదో తెలియని స్వాంతన...ఇంతలో అమ్మ స్వరములో మధురమైన లాలిపాట నను లాలిస్తుంటే నన్ను నేను మైమరుస్తూ అలానే అమ్మ ఒడిలో నిదురపోయాను.

అకస్మాత్తుగా అర్థరాత్రి మెలుకువ వచ్చింది. చూస్తే అమ్మ భుజాలపై నేను చిన్నగా కదులుతుంటే నిదురలోనే అమ్మ నన్ను జో కొడుతుంటే నేను అలానే కదలకుండా గుండెలపై ఉండిపోయాను.

అంతలో ఆ రోజు జరిగిన సంగతి గుర్తుకు వచ్చింది.

ప్రేమ ప్రేమ అంటూ ఎన్నాళ్లిలా కాలాన్ని కరిగిస్తావు?

నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు?

అంటూ నాన్న నన్ను పెళ్లి  చేసుకోమంటు ఆజ్ఞాపిస్తుంటే.. గొంతుకేదో అడ్డంపడ్డట్లు...కక్కలేక మింగలేక..నాన్నకు ఎదురు చెప్పలేక..మనసుకు సర్దిచెప్పుకోలేక..విషాన్ని సేవించిన అనుభూతిని అంతఃకరణను స్వేచ్ఛగా ప్రకటించలేక మేడపైకి వచ్చాను.                    

ఇంట్లో నాన్న...బయట ఫ్రెండ్స్ పెళ్లి పెళ్లి అంటూ సతాయిస్తూ నన్నుక్కిరిబిక్కిరి చేస్తుంటే తట్టుకోలేక "హే........" అంటూ ఎలుగెత్తి అరుస్తున్నాను.


నువేమో మొహం తిప్పుకుని అటుంటే..నేనేమో మొట్ట మొదటి వర్షపు చినుకు కోసం ఎదురు చూసే చకోరపక్షిలా వేచి చూస్తూ దాహముతో అలమటిస్తున్నాను    

నువేమో ఆకాశములోని  నిండు మేఘములా ఇప్పుడో అప్పుడో కురిసే చినుకుల నను ఊరిస్తూ ఊరిస్తూ ఊపిరి తీస్తూ చంపేసే నిన్నేమనాలి?

Comments

Popular posts from this blog

Love Letter 46

Love Letter 45

Love Letter 6