Love Letter 10
Written By Bhanuchandara
ప్రేమించడం తప్పా...!
ప్రేమ గాయం మనసుని బాధిస్తుంటే..రోదించటం తప్ప ఏమి చేయలేని అశక్తురాలిని.
ఈ వెలితి..అది ఇది అని చెప్పలేని అసంతృప్తి.
నా పలుకులో తీయ్యదనం మాయమైంది..నా నడకలో హొయలు కన్పించకుండా పోయాయి. మొత్తానికి నా మోహములో కళాకాంతి మచ్చుకు కూడా కన్పించటం లేదు.
నీ ఉహల ఊయల్లో ఉరకలేస్తూ..ఆనందముతో చెలరేగి పోయే నేను అప్పటికప్పుడే గాలి తీసిన బెలూన్ లా మెత్తగా...మన్ను తిన్న పాములా దిగులు నిండిన మనసుతో మూలకెళ్లి కూచుంటాను.
నీ ఆలోచన నను వెంటాడుతు... నా హృదిని రంపములా కోస్తూ నరకయాతనకు గురిచేస్తుంది.
ఈ భాదను అనుభవిస్తూ.. ఏమిలేనట్లు చిరునవ్వులు ఒలికిస్తూ..నాలో జ్వలించే వేదనను దిగమింగుతూ ఓహ్! వర్ణనాతీతం.
నీకు తెలుసా!..ఉన్నట్లుండి నా పీక ఎవరో నులిమేసినట్లు కాదు..కాదు నేను బ్రతికుండగానే నన్నెవరో భూమిలో పాతి పెట్టేసినట్లు ....
నీ నామస్మరణ నాలో ఉత్తేజాన్ని..ఉద్వేగాన్ని రగిలిస్తే..నువ్వు నా పక్కన లేవన్న వాస్తవం నాలో నిరుత్సాహాన్ని..దుఃఖాన్ని కలిగిస్తూ నేనొక్కదాన్నే ఒక్కటి ప్రపంచమంతా ఒక్కటే అనే భావనతో నిశిని ఆశ్రయించి సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంటాను.
ప్రేమలోని తియ్యదనాన్ని అనుభవించాలంటే "వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకంటే వలచి విఫలమొంది విలపింప మేలు" అన్నాడో కవి
కానీ ఇక్కడ ప్రేమ విఫలం కాలేదు. పక్కన నువ్వు లేకపోతేనే చచ్చిపోతున్నా.. అలాంటింది విఫలమైతే జీవచ్ఛవనవుతానేమో! మరణం తో సమానమైన ఈ ప్రేమ వద్దు...నాకు నువ్వు కావాలి.
మన జంట ప్రపంచానికే ఆదర్శం కావలి.






Comments
Post a Comment