Love Letter 7
written By Bhaanuchandara
ప్రేమ ఎంత మధురం..ప్రియుడు అంత కఠినం
పాడుకుంటూ..నిను తిట్టుకుంటూ నడుస్తున్నాను.
అంతలోనే ఈ మధ్య నేను చదివిన ఓ కొటేషన్ గుర్తొచ్చింది.
Where there is hope ...there is faith
Where there is faith miracles happen
ఆశ మనిషికి ప్రాణం పోస్తుంది..నమ్మకం అద్భుతాలు సృష్టిస్తుంది.
నమ్మకమనే ఆశతో కళ్ళల్లో ఊపిరి నింపుకుని ఎదురుచూస్తున్నా
నిన్నే తలుస్తూ..స్మరిస్తూ ఎదురుగా ఉన్న కాఫీడేలోకి వెళ్ళాను.
ఆర్డర్ చెపుతూ ఎందుకో పక్కకు తిరిగి చూసేసరికి ఒక్క సారిగా గుండె ఆగినంత పనయ్యింది.
నువ్వు ఇక్కడ..ఒక్క క్షణం అర్థం కాలేదు.
టేబుల్ దగ్గర నుండి లేచి నీ వద్దకు వచ్చేంతలో...నువ్వు కాదని అర్థమైంది.
యెంత ఆశ పడ్డానో..అంత నిరాశతో..
కనుబొమ్మల్లో..నీరు చేరగా..నీదు తలుపులే మదిని భాదిస్తు..వేధిస్తుంటే..
తట్టుకోలేక బయటకు వచ్చాను.
నీ తలపులే నను నడిపిస్తుంటే ఎటు నడుస్తున్నానో తెలియదు.
కీచ్ మంటూ పెద్ద శబ్దం చేస్తూ కార్ ఆగింది. నేను ఉలిక్కిపడి పక్కకు తప్పుకున్నాను.
కార్ లో నుండి నా ఫ్రెండ్ రాధ దిగి నా దగ్గరకు వచ్చి ఏమైందే..ఒళ్ళు తెలియకుండా నడుస్తున్నావంటూ అరుస్తుంది.
ఏమి చెప్పలేక.నవ్వుతు ఆమె కార్ లో కూచున్నాను.
తను ఏమేమో చెప్తూ అకస్మాత్తుగా నీ గురుంచి అడిగింది.
ఏం చెప్పను...? నా మీద కోపముతో ..నన్ను కలవటం లేదని చెప్పనా!
మనిద్దరి మధ్య ఏమి జరగనట్లు..నీ గురుంచి చెప్పటం కూడా చాల కష్టముగానే ఉంది.
అయినా నవ్వుతు చాల మాములుగా చెప్పాను...ముక్కు సూటిగా ఉండే నేను..హావభావాలు మార్చటం... ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.
అయినా విరహాల మధురోహల్లో తేలుతూ..నీ గురించి నా ఇంటి ముంగిట్లో వేచి చూస్తున్నాను.
Comments
Post a Comment