Love Letter 12
Written By Bhaanu Chandara
ప్రేమ... ప్రేమ... ప్రేమ
ప్రేమ కోసం ఎదురుచూస్తున్నానా!
నీ కోసం ఎదురు చూస్తున్నానా!
అర్థం కానీ పరిస్థితి
ప్రేమ కోసమైతే నువ్వు రావాలి కదా!
నీ కోసమైతే ప్రేమ రావాలి కదా!
నీతో గొడవ పడాలి..సత్యభామలా అలిగి మంచమెక్కాలి. నువ్వు నాకు సేవకుడిలా సేవలు చేస్తుంటే..నేను మహారాణిలా నీ హృదయ సింహాసనం అధిష్టించాలి.
ప్రతో రోజు నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి నువ్వు రాక..తల్లడిల్లే మనసును సమాధానపర్చుకోలేక..అక్కడే కళ్ళల్లో వత్తులు పెట్టుకుని గుమ్మం దగ్గరే కూచుంటాను.
ఆ నిరీక్షణలో అలాగే నేను గోడకు చేరగిలపడిన సమయాన..కళ్ళు ఏదో మూతలు పడ్తుంటే..అప్పుడే ఏదో అలికిడి..నువ్వు వచ్చావనే భ్రాంతిలో ఉలిక్కిపడి నే దిక్కులు చూస్తుంటే నువ్వు రాలేదన్న నిజాన్ని గ్రహించి..సత్యాన్ని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ అలానే సొమ్మసిల్లిపడిపోయుంటే..
ఇంతలో ఆఫీస్ నుండి ఫోన్..లేని ఓపికను కూడగట్టుకుని ఆఫీస్కు రిపోర్ట్ చేసే క్రమములో
ఓ కప్ కాఫీ తాగి నాలోని ఓపికకు బలం చేకూరుస్తూ...ఆఫీస్ పని చేస్తూంటానా!
ఇంతలో రాధ దగ్గరి నుండి ఫోన్ వచ్చింది.
తను ఆ మాట..ఈ మాట మాట్లాడుతూ మధ్యలో నిన్నడుగుతుంటే ...
లేని నవ్వును మొఖానికి పులుముకుంటూ..గొంతులో దాగిన దుఃఖాన్ని పెదవుల మాటున దాచేసి ఎన్నెన్ని నిజాలు ప్రవచిస్తానో...
నవ్వొస్తుంది...నవ్వుతూనే లోపలికెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తాను.
ఏడుస్తూ నిన్నే తలుస్తూ ఊరడిల్లుతాను.
ఊరడిల్లుతూనే..ఉన్నపాటున ఊపిరి పోగొట్టుకుంటాను.
ఇలా రోజుకి ఉన్న ఇరవై నాలుగంటల్లో ఎన్ని సార్లు మరణిస్తానో..ఎన్ని సార్లు జీవిస్తానో.
ఈ జనన మరణాల చక్రములో నలుగుతూ ఆకాశమై నీ కోసం ఎదురుచూస్తున్నాను.
Comments
Post a Comment