Love Letter3
Written by Bhaanuchandra
రేయ్
ప్రేమతో ముద్దుల మాలను సుగంధాలతో సమర్పిస్తూ.......ఎప్పుడెప్పుడా అని నా లేఖ కోసం ఎదురుచూస్తూ ..బరువుగా కాలం గడుపుతున్న మిత్రమా
కాలం ఎంత చిత్రమైనది...నిన్నటివరకు నేను..నీ కోసం ఎదురు చూస్తే, ఇప్పుడేమో నువ్వు నా కోసం నిరీక్షించటం.. ఓహ్..బాగుంది.
ఇప్పటికిప్పుడే వచ్చి నీ గుండెలపై వాలిపోవాలనేంతగా హృదయం ఉవ్విళ్లూరుతోంది.
మేఘాలపై సరాగాలు పాడుతూ విహరించాలని ఉంది.
అందమైన జీవితములో ఆనందముగా జీవించాలి కానీ యిల మనల్ని …మన మనసుల్ని కష్టపెట్టుకోడం ఏ మాత్రం బాగాలేదు.
ఉన్నదీ ఒకే ఒక జీవితం. దాన్ని సంతోషముగా ఎంజాయ్ చేద్దాం.
కోపాలు..మన జీవితానికి శాపాలు
కోపాలు మానవ జీవితానికి పాపాలు
వెలిగే దీపంలాంటి మన జీవితాన్ని ఆర్పేది కోపమే. సో.. కోపాన్నే ఆర్పేస్తే మన జీవితం వెలుగుతూ ఉంటుంది.
ఈ వెలుగే మన జీవితాన్ని కాంతివంతం చేస్తుంది...కాంతివంతమైన జీవితం ఆహ్లాదాన్ని..ప్రమోదాన్ని ఒసగుతుంది.
అన్నట్లు నీ చూపులు ..గుండెను చీల్చేస్తుంటే తట్టుకోలేక నా వాలు కనులు సోలిపోతున్నాయి..నా అధరాలు పదే పదే అదురుతూ అందమైన నా వదనాన్ని మరింత తేజోవంతం చేస్తుంది. నీ సన్నిధిని ఆహ్వానిస్తూ నా మేను చందనాల పరిమళం వెదజల్లుతుంది.
నువ్వి క్షణం నన్ను చూస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా జనన మరణాల అంచుల వరకు తీసుకెల్తావు.
కాదు కాదు భూలోకపు సరిహద్దుల్లో కూచో బెట్టి భూమధ్యరేఖ కోసం వెదుకుతావు. లేదా ఆకాశపు అంచుల్లో కూచోబెట్టి అసలు అందమెక్కడుందో తెలియక తికమక పడతావు.
నీకసలే కంగారెక్కువ కదా!
ఊరిస్తూ..ఊపిరి తీస్తున్నానంటావా!..ప్రేమిస్తూ ప్రాణం పోస్తున్నానంటావా!
ఉన్న ఒక్క జీవితాన్ని ఆనందముతో జీవించడమే కదా! జీవితమంటే...చస్తే మరో జన్మ ఉండదంట
నేను సిద్ధం..మరి నువ్వు
చెప్పు నీ గురించి నీ మాట గురించి ఎదురు చూస్తూ... ముద్దుల తోరణాలతో స్వాగతం పలుకుతూ...
రేపటి వరకు నిరీక్షిస్తావని.


Comments
Post a Comment