Love Story 35
Wrtiiten By Bhaanuchandara
మనిద్దరం సాయంసమయాన చెంగున చెంగున ఎగురుకుంటూ గోదావరి ఒడ్డుకు చేరుకొని..మన వెంట తెచ్చుకున్న కొన్ని మాటలను..కొన్ని నవ్వులను..ఇంకొన్ని మెరుపులను..మరికొన్ని సిగ్గులను పంచుకుంటూ...నంచుకుంటూ..రుచులను ఆస్వాదిస్తూ..వాటినే నెమరేసుకుంటూ..అప్పుడప్పుడు వాలుచూపులతో సోయగాల పాయసాన్ని సేవిస్తూ...
ఆ ఇసుక తిన్నెల్లో... వెన్నెల్లో పరుగులు తీస్తూ..నడవలేక..నడిచే ఓపికలేక ఇసుకపై అడ్డముగా పవళించి నువ్వు రొప్పుతుంటే..అబ్బాయి గారు పనైపోయిందని నే..వెక్కిరిస్తుంటే..నువ్వు ఉడుకుమోత్తనముగా నా మీద కలియబడబోతుంటే...
మల్లి అంతలోనే నేను బయపడ్తున్నానేమో అనుకుంటూ నా వైపు చూస్తూ..నా బుజం మీద చేయి వేసి నన్ను దగ్గరకు తీసుకుంటుంటే..నాకు నవ్వొచ్చింది.
వెంటనే నువ్వు వచ్చిరాని పాట పాడ్తుంటే నేను నాట్యం అభినయిస్తుంటే ..అది చూసి రెట్టించిన ఉత్సాహముతో గార్ధభ స్వరాన్ని కీర్తిస్తుంటే..అపశృతిని సహించలేక నే పాటనైతే నువ్వు నాట్యమాడుతూ గోదారిని ఉరకలెత్తిస్తూ శివ తాండవమాడవు.
అబ్బా...ఎంత మధురమో కదా! ఆ దృశ్యం.
తెల్లని మల్లెల తోరణాలతో స్వాగతమంటూ పానుపు వేసింది.
మర్రి చెట్టు ఊడలతో జాజిపూలు కలగలిసి ఉయ్యాల సిద్ధం చేసింది.
కారడవిలోని జంతువులు..పక్షులు మనకు సన్మాన సభ ఏరాటు చేసాయి.
పచ్చని చెట్లమాటున దాగిన స్వచ్ఛమైన సెలయేరు జలకాలాడగా రమ్మంది.
సుగంధ వాయువుల సుమగంధాలలో..కేరింతల పులకరింతల్లో సేదతీరగా రమ్మంది.
అక్కడికి ఈ బుంగమూతిని బంతిపూల బుట్టలో పట్టుకెళ్ళావా...! ప్లీజ్..ప్లీజ్.
బుట్టలో పడేస్తునంటావా...!
ఎవరిని ఎవరు బుట్టలో పడేశారో...అందరికి తెలుసులే...మూసుకుని రా......యే
Comments
Post a Comment