Love Letter 25
Written by Bhaanuchandara ఆ నైట్ కావ్య వాళ్లింట్లోనే నిదురపోయాను. ఉదయమే లేచి నేను తయారవుతుంటే...కావ్య తరువాత వెల్దువులే అంటున్న వినకుండా బయల్దేరుతుంటే..నా వెనుకే డాలిగాడు కూడా ప్రదక్షిణ చేస్తూ.. నేను వెళ్లొదన్నట్లు ఒకటే అరుస్తున్నాడు. నేను వెళ్లి వాడికి ముద్దిస్తుంటే తప్పదా! అన్నట్లు కుయ్ కుయ్ అంటూ మూలిగింది.నేను తప్పదన్నట్లు నవ్వాను. అది బేలగా నా వైపే చూస్తూ నుంచుంది. దాని చూపులు అచ్చం నాలానే ఉన్నాయి. అయిన నన్ను..నేను తమాయించుకుని బై చెపుతూ బైటికి వచ్చి కార్ ఎక్కాను. కార్ లో కూచున్నానన్న మాటే కానీ...నా చుట్టూ శూన్యం..కళాకాంతుల్లేని జీవితములో ప్రయాణిస్తూ నేను. కన్నీళ్లు పలకరిస్తుంటే కరిగిపోతూ నీరవుతున్నాను. ఇంతలో కావ్య దగ్గర నుండి ఫోన్... ఇంతలోనే ఫోనా అనుకుంటూ ఆశ్చర్యముత