Posts

Showing posts from April, 2023

Love Letter 45

Image
                                                                                                          Written By Bhanu Chandara సునంద వాళ్ళ బ్యాచ్ తో కలిసి విజయవాడ వెళ్ళాను.                             దుర్గమ్మవారిని దర్శించుకుని కృష్ణమ్మ చెంతలో నేను, సునంద, అరుణ, మానస,                                                                                  లక్ష్మి  వగైరా...వగైరా  కూచున్నాం.                                                                                          మధాహ్నం రెండైంది. ఆకలి బాగా వేస్తుంది. దుర్గమ్మ దగ్గర కొన్న పులిహోర ప్యాకెట్ ఓపెన్ చేసి కొద్దీ కొద్దిగా తింటుంటే...అరుణ తన బాగులోనుండి బీజర్ తీసింది. తలా ఒకటి ఇస్తుంటే నాకు వద్దన్నాను. ఏమి కాదులేవే తీసుకో అంటూ ఓపెన్ చేసి ఇచ్చారు. నేను చేతిలో పట్టుకుని తాగకుండా నీ గురించే ఆలోచిస్తుంటే..ఏయ్ దొరసాని...లండన్ వెళ్ళావా ఏంటి? అంటూ నన్ను వేలకొలాం చేస్తూంటే...నేను బలవంతముగా నవ్వుతు అరుణ ఇచ్చిన బీజర్ మొత్తం తాగేశాను.  అంతలో సునంద వైన్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసింది. నేను ఇంకో బీజర్ తీసుకుని అందులో సునంద ఇచ్చిన వైన్ కలుపుకుని

Love Letter 44

Image
                                                                                                               Written By Bhaanuchandara నేను ఒక్కదాన్నే మేడపై వెల్లకిల పడుకుని ఆకాశములో నక్షత్రాలను లెక్కబెడుతున్నాను. ఎంతకీ లెక్క కుదరటం లేదు...అయిన మల్లి మల్లి ప్రయత్నిస్తున్నాను.  ఉహు మల్లి మొదటికే లెక్క వచ్చింది.   అది వెన్నెల రేయి..నన్ను చూసి శరత్చంద్రుడు కొంటెగా నవ్వుతున్నాడు. ఆ కొంటెతనాన్ని భరించలేక ఉడుకుమోత్తనంతో పదే పదే ప్రయత్నిస్తూ లెక్కించలేక ఓడిపోతున్నాను.  నాలోని సహనానికి మరింత మెరుగులు దిద్దుతూ...పట్టు వదలని విక్రమార్కుడిలా బేతాళుడి        (నీ ప్రేమ) అన్వేషణలో...  ఇంతలో అమ్మ వచ్చింది. ఏం చేస్తున్నావంటూ ప్రశ్నిస్తుంటే..నేను మాట్లాడకపోయేసరికి నా పక్కన తను పడుకుంది. నా చేతుల్ని తన చేతిలో పట్టుకుని నా బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఆ స్పర్శతో అప్పటివరకు ఎక్కడున్నాయో తెలియని నీరు కన్నుల నుండి స్రవిస్తూ చంపలపై చేరి నను తడిపేస్తుంటే..అది గమనించిన అమ్మ "పిచ్చి" అంటూ నన్ను గుండెలకు హత్తుకుంది.  ఏదో తెలియని స్వాంతన...ఇంతలో అమ్మ స్వరములో మధురమైన లాలిపాట నను లాలిస్తుంటే నన్ను నేను

Love Letter 43

Image
                                                                                                               Written By Bhaanuchandara లవ్ యు లవ్ యు మై డియర్.  ఐ లవ్ యు  "ప్చ్" ఎంత స్వీటో  సిగ్గా.....కొత్తగా ఏమిటిది...ఓహో నేను లవ్ యు అన్నందుకా! ఆస్వాదించు బే...నకరాలు చేయకు.      లవ్ యు అంటేనే మెలికెలు తిరిగే నువ్వు                         మల్లెల దరహాసాల లాంటి పరిమళించే ముద్దిస్తే తట్టుకోలేవేమో!  అబ్బో..నీ సిగ్గును కాకులెత్తకెల్లా...ఎందుకైనా మంచిది "...."  కొంచెం దాచుకో!  అందరు చూస్తున్నారు. మరి బాగోదు.      అప్పుడెప్పుడో నా కట్టు..బొట్టును నా నవ్వును చూపును... నా మాటను నడకను...నన్ను  ,,,నాలోని ప్రతి కదలికను..ఆణువణువూ  ప్రేమించి అల..అల ఆకాశమంత ఎత్తుకు చేర్చి..  ఇప్పుడేమో నువ్వు కనపడకపొతే నేనేం చేయను?      ఆశ్చర్యార్ధకమైన మొముతో కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని అంతగా చూడకు...నాకు " సిగ్గు" వేస్తుంది. నేను ఆడపిల్లను...నాలోని సౌందర్యం కన్నుల్లో  ఒలికినప్పుడల్లా..  నిను మించిన సిగ్గుతో అద్దానికే చిరాకుపెట్టించిన అందాన్ని. నెలవంకలాంటి నా పెదాలను..నిండు జాబిలిలా మా

Love Letter 42

Image
                                                                                                          Written By Bhaanuchandara పున్నమి జాబిలిని చూసిన సముద్రుడు ..పొంగే సంతోషాన్ని దాచుకోలేక..లోలోన  ఉప్పొంగుతూ...అటు ఇటు పరిగెడుతూ..తనలోని ఆరాటాన్ని లోపల దాచుకోలేక..బయట పూర్తిగా వ్యక్తపరచలేక...అతలాకుతమవుతూ...తనలో తానూ మధనపడుతూ...రసావేశముతో ఉప్పెనై...హొయలు పోయే వెన్నెల వన్నెలను చూసి తట్టుకోలేక ఉన్నపలంగా జాబిలిని తనలో దాచుకోవాలని ఎగేసెగిసి పడుతూ.. దరి చేరమంటూ అందరి ముందు తనని దీనంగా ప్రాధేయపడుతూ...శతసహస్ర విధాలుగా   వేడుకుంటూ...బ్రతిమాలుతూన్నా సముద్రుడ్ని కాంచిన  జాబిలి మరింత సిగ్గుతో కందిపోతూ లేలేత పసుపచ్చని వస్త్రాన్నిసముద్రుడిపై కప్పి సరసమాడుతూ సాగరంలో కలిసిపోయింది.  సముద్రుడ్ని చూస్తే జాబిలికి పరవశం...జాబిలిని చూస్తే సముద్రుడికి మహదానందం. కానీ ఒక రోజు... సముద్రుడు చేసే అల్లరి..చిలిపితనం భరించలేక మబ్బులమాటున ఉండిపోయింది. సముద్రుడు జాబిలి కానరాక దిగాలుగా ఎప్పుడొస్తుందా! అని ఆకాశం వంకే చూస్తూ కన్నీళ్ల పర్యంతమవుతూ...విరహగీతాలాపన చేస్తుంటే ...మబ్బుల చాటున దాగిన జాబిలి వెంటనే ప్రత్యక్షమై చ

Love Letter 41

Image
                                                                          Written By Bhaanuchandara   చంద్రకళ వాళ్ళింట్లో ఫంక్షన్ ఉందని పిలిచింది...పిలవటం వరకు బాగానే ఉంది కండిషన్ అప్లై చేసింది..లైట్ పింక్ కలర్ చిరకట్టుకు రమ్మంటు ఆర్డర్ పాస్ చేసింది. అల అని రాకుండా ఉంటె చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.   అదేమని అడిగితె ఈ ఫంక్షన్ కు పింక్ కలర్ సారీస్ డ్రెస్ కోడ్ పెట్టాను అంటూ చెప్పింది    నిజానికి వెళ్లే మూడ్ లేదు. కానీ వెళ్లకపోతే బాగుండదు అనుకుంటూ ఎక్కడో వార్డ్ రోబ్ లో అడుగున ఉన్న పింక్ కలర్  శారీ తీసాను.    అది చూడగానే నువ్వు గుర్తొచ్చావు. మనం మైసూర్ వెళ్ళినప్పుడు..చేతిలో చాలినంత డబ్బులు లేకపోయినా నేను వద్దు వద్దు అంటున్న వినకుండా అప్పటికప్పుడు అప్పు చేసి కొన్నావు. ఇప్పుడిది అవసరమా! అంటుంటే.. అవసరం కాకపోవచ్చు..కానీ మనం పదే పదే మైసూర్ రాకపోవచ్చు. కొందామనుకున్నప్పుడు ఇలాంటి కలర్ దొరకకపోవచ్చు. అయిన నీలాంటి అందెగత్తె ఈ చీర కడితే ఈ చీరకే అందమొస్తుంది. అంటూ నన్ను మాటలతో మోసేస్తు...చీరను కొన్నావు. ఏ మాటకామాటే చెప్పాలి నీ సెలక్షన్ అద్భుతం. ఎప్పుడు చీర కట్టిన లేడీస్ అయిన జెంట్స్ అయినా ప్రతి ఒక

Love Letter 40

                                                                      Written By Bhaanuchandara నీకు గుర్తుందా ! మనిద్దరం అనంతగిరి హిల్స్ కు ట్రెక్కింగ్ కు వెళ్ళినప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన జోరున కురుస్తుంటే...దూరముగా పిడుగు పడ్డ శబ్దానికి ఒకరికొకరం మరింత దగ్గరగా చేరి..నేనేమో భయముతో నీ చేయి పట్టుకుంటే..నువేమో నీ గుండెలో భయాన్ని మోములో కనపడనీయకుండా  నన్ను మరింత దగ్గరకు తీసుకుని నా వాలుకనుల వైపు అలానే చూస్తూంటే..ఇంతలో దూరముగా నక్కల అరుపులు..మరో పక్క తీతువు పిట్ట అరుపులు మరింత భయంకరముగా ధ్వనిస్తుంటే ..ఆ శబ్దాలకు...అదిరే నా గుండెలను...స్వాంతనపరుస్తూ  వీపుపై మెత్తగా సవరిస్తూ ..నీ మనోధైర్యపు ప్రసాదంలో నీ బుగ్గ మీద సిగ్గునై ఎర్రగా కందిపోతుంటే..నువేమో దరహాసాలొలికిస్తూ...మధురాతి మధురమై మనిద్దరం.  తెల్లారే సరికి ఇద్దరికీ జ్వరం..ఒకటే తుమ్ములు ఇంట్లో వారికీ ఏమైందో అర్థం కాక మనిద్దరిని గుచ్చి గుచ్చి చూస్తూ ఏమైందని అడుగుతుంటే..ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరం దొంగచూపులతో...దొర దొరగా వేగిపోతూ..తేలుకుట్టిన దొంగల్లా అక్కడినుండి చిన్నగా జారుకున్నాం.  ప్రేమంటే చిరునవ్వుల చిలకరిస్తూ..శూన్యములో