Love Letter 46
Written By Bhaanuchandara ఎంతమంది చుట్టూ ఉన్న నువ్వు లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. నువ్వే లేని ప్రపంచంలో ఎలా జీవించాలి? నీ తోడు లేక నేనెలా బ్రతికేది? ఆ ఖాళీని ఎలా భర్తీ చేయను? ఎలా ఎలా పురించను? ఎండమావిని చూసి నీటి చలమలని భ్రమిస్తూ అలసి సొలసి చేరుకున్నాను. ఏమి లేదు... ..అదే ఎండ నన్ను కాల్చేస్తూ..నాలోని ప్రాణాన్ని తోడేస్తూంటే...నీ ప్రేమ దప్పికలో అల్లాడుతూ...నిర్వేదంతో..నిస్తేజముతో చతికిలపడ్డాను. ఇంతలో ఎక్కడినుండో "పొట్టి పొట్టి" అంటూ రాగయుక్తముగా వినపడ్తుంటే నువొచ్చావేమోనని దిగ్గున లేచాను. నాలోని నవ నాడులు సుస్వరాలు ఆలపించగా పిలుపు వినపడిన వైపు నడిచాను. నేను పరుగు పరుగున అక్కడికి వెళ్లి ఆ పిలిచే అతన్ని తేరిపారా చూస్తుంటే..నన్ను ఎగాదిగా చూస్తూ ఏమనుకున్నాడో ఏమో అక్కడినుండి మెల్లగా జారుకున్నాడు. ఇంతలో ఒకమ్మాయి వచ్చి ఏమిటలా పరిగెత్తుకుంటూ వచ్చావని అడుగుతుంటే "అదే అదే పొట్టి పొట్టి అని పిలుస్తుంటే తెల్సిన కంఠంలా అనిపించి వచ్చానని చెప్పాను. దానికా అమ్మాయీ నవ్వుతు అదా